తమిళనాట హీరో విజయ్ టీవీకే అనే పార్టీ పెట్టుకుని దున్నేద్దామని ప్రయత్నిస్తున్నారు.అయితే హీరోగా ఉన్నప్పుడు రూమర్స్ అన్నీ ఎక్కడో గాసిప్స్ కాలమ్కే పరిమితమవుతాయి కానీ రాజకీయాల్లోకి వచ్చాక అవే హెడ్ లైన్స్ అవుతున్నాయి.ఇప్పుడు విజయ్ కు అలాంటి పరిస్థితే ఎదురయింది. హఠాత్తుగా తమిళనాడు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఎవరు ఈ సంగీత అంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ భార్య. అమెకు ఏమయిందని అందరూ కంగారు పడ్డారు. కానీ ఏమీ కాలేదు. త్రిషతో కలిసి తిరుగుతున్న విజయ్ సంగీతకు అన్యాయం చేస్తున్నారని ఆమెకు న్యాయం చేయాలని తమిళనాడులోని వ్యతిరేక పార్టీల కార్యకర్తలు ఈ ప్రచారం అందుకున్నారు.
కీర్తి సురేష్ పెళ్లి గోవాలో జరిగింది. ఈ పెళ్లీ కోసం విజయ్ తో పాటు మరోఐదుగురు తమిళ సినీ ప్రముఖులు స్పెషల్ ఫ్లైట్లో గోవా వెళ్లారు. ఈ ఐదుగురిలో త్రిష కూడా ఉన్నారు. భార్యను కాకుండా త్రిషను తీసుకెళ్లారని ఇతర పార్టీల కార్యకర్తలు రచ్చ ప్రారంభించారు. అయితే దీనికి ఓ బేస్ ఉంది. గత ఏడాది భార్యతో విజయ్ కు విబేధాలొచ్చాయని .. విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. దాంతో ఈ ప్రచారం మరింత ఉద్ధృతంగా సాగింది.
ఇందులో నిజం ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి దాడులు విజయ్ ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఒక వేళ ఆయన స్పందిస్తే చిలువలు పలువులుగా మరింత ఎక్కువగా ప్రచారం చేస్తారు. స్పందించకపోతే.. అదిగో నిజమనే స్పందించలేదంటారు.ఇలాంటివి ఆయన చాలా డీల్ చేయాల్సి ఉంటుంది.