ఈనెలాఖరున నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్`’విడుదలకు రెడీ అయ్యింది. ప్రమోషన్లు వెరైటీగా చేస్తున్నారు. నితిన్ – శ్రీలీల జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ‘అదిదా సర్ప్రైజు’ పాట మరో ఎస్సెట్. వీటితో పాటు డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. క్రికెట్ ప్రియులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మైదానంలో వార్నర్ ఓ చిచ్చర పిడుగు. రీల్స్ లో కూడా తన ప్రావీణ్యం చూపించుకొన్నాడు. ముఖ్యంగా ‘పుష్ప’ సమయంలో వార్నర్ చేసిన రీల్స్ వైరల్ అయ్యాయి. అలా తనలోని కొత్త టాలెంట్ ని బయటకు తీసుకొచ్చాడు.
ఇప్పుడు వార్నర్ ఓ తెలుగు సినిమాలో నటించడం… తప్పకుండా ప్రధాన ఆకర్షణే. ఈ సినిమాలో డేవిడ్ ఎంత సేపు కనిపిస్తాడు? అతని పాత్ర నిడివి ఎంత? తనకు పారితోషికం ఏమిచ్చారు? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వార్నర్‌ది ఇలా కనిపించి, అలా మాయమైపోయే పాత్ర కాదని, తన పాత్రకంటూ ప్రత్యేకమైన స్పేస్ ఉంటుందని తెలుస్తోంది. కనీసం 5 నిమిషాల పాటు వార్నర్ తెరపై కనిపిస్తాడట. ఆ సన్నివేశాల్ని 4 రోజుల పాటు తెరకెక్కించారని, ఇందుకు గానూ వార్నర్‌కు 2.5 కోట్ల పారితోషికం ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి వార్నర్ రోజుకు రూ.కోటి పారితోషికం అడిగాడని, మైత్రీ మూవీస్ బేరాలు ఆడి రెండున్నరకు తెగ్గొట్టారని చెబుతున్నారు. 5 నిమిషాల సన్నివేశానికి రూ.2.5 కోట్లు ఇవ్వడం పెద్ద మేటరే. మరి వార్నర్ ఈ సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవుతాడు? ఇచ్చిన పారితోషికానికి న్యాయం చేసినట్టా, లేదా? అనేది సినిమా విడుదల అయితే కానీ తెలీదు.