తాను ప్రభుత్వ ఉద్యోగినని.. ప్రభుత్వం ఏం చేయమంటే.. అది చేయడమే తన విధి అని కొద్ది రోజుల క్రితం.. ఓపెన్‌గా చెప్పారు తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి. సచివాలయంలోకి జర్నలిస్టులను అనుమతించకపోవడంపై…. వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఓ రకంగా తాను నిమిత్తమాత్రుడ్నని చెప్పుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. అదే బాట ఎంచుకున్నారు. తాను ఓ బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించుకున్నారు. గౌతం సవాంగ్ .. కాస్త నిర్వేదంగా ఇలా ప్రకటన చేయడానికి కారణం… గత నాలుగు నెలల కాలంలో పోలీసులపై .. వచ్చిన తీవ్రమైన ఆరోపణలే.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ ఆరోపిస్తోంది. దానికి తగ్గట్లుగా.. పల్నాడు గ్రామాల నుంచి వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తల దగ్గర్నుంచి… టీడీపీ నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులు, అరెస్టుల వరకూ.. ప్రతీ విషయంలోనూ.. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నరనే విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తూ డీజీపీ కూడా.. టీడీపీ నాయకులు.. వినతి పత్రాన్ని ఇవ్వడానికి వస్తే.. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా..వారికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. తర్వాత వైసీపీ నేతలు వస్తే.. మాత్రం.. సమయం ఇచ్చి వారి ఫిర్యాదు తీసుకున్నారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. డీజీపీ స్థాయిలోని వ్యక్తి పక్షపాతంతో వ్యవహరించి.. ఇక దిగువ క్యాడర్ అధికారుల ఏం సందేశం పంపారని ప్రశ్నించారు.
అదే సమయంలో.. సోషల్ మీడియా… వైసీపీ తరపున .. ఇతర పార్టీల నేతలను అత్యంత హీనంగా కించ పరుస్తూ పోస్టులు పెడుతున్నా.. పోలీసులు స్పందించడం లేదు. కానీ.. ఇతర పార్టీలకు చెందిన వారిని చిన్న చిన్న పోస్టులు.. అభ్యంతరకరం కాకపోయినా… అరెస్టులు చేస్తున్నారు. ఇదంతా.. ఓ భయానక వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల తీరుపై… టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూండటంతో.. డీజీపీ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజకీయ పరమైన ఆరోపణలను తాను స్పందించబోనంటున్నారు. అందులో తన పాత్ర లేదని.. చెబుతున్నారు.