చెన్నై దూరదర్శన్ ఉద్యోగి పి.వసుమతిని కేంద్ర ప్రభుత్వం ఉన్న పళంగా సస్పెండ్ చేసేసింది. ఆమె చేసిన తప్పు ప్రధానమంత్రి ప్రసంగాన్ని దూరదర్శన్ తమిళ్ చానల్లో లైవ్ టెలికాస్ట్ చేయకపోవడం. చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళనాడు వెళ్లారు. అక్కడ తనపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించుకునే క్రమంలో.. తమిళభాషపై.. అమితమైన ప్రేమ కనబరిచారు కూడా. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగం హైలెట్ అయింది. తన అమెరికా టూర్‌ను అక్కడి తమిళుల్ని.. మిక్స్ చేసి… తమిళ భాషతో సెంటిమెంట్ రగిల్చారు. నిజానికి హిందీ భాష విషయంలో తమిళుల్లో… కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఉంది. వీటన్నింటి లెక్క సరి చేసుకుందామనుకున్న మోడీ… ఐఐటీ మద్రాస్‌లో ప్రసంగానికి బాగానే కసరత్తు చేశారు. ఇంత జరిగినా… అన్ని తమిళ చానళ్లు మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినా… తమిళ దూరదర్శన్ మాత్రం లైట్ తీసుకుంది.
ఓ వైపు మోడీ ప్రసంగం కొనసాగుతూంటే.. మరో వైపు సినిమా పాటలు… సీరియల్ ప్రసారం చేసింది. సాధారణంగా … దూరదర్శన్ రీజినల్ చానళ్లు అంటే.. ప్రభుత్వ పెద్దల కార్యక్రమాలకే పరిమితమై ఉంటాయి. అలాంటి మోడీ మాట్లాడితేనే… ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. మోడీ ప్రసంగాన్ని అసాంతం ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. సీనియర్ అధికారుల వద్ద నుంచి.. దూరదర్శన తమిళ చానల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ.. వసుమతి అనే అధికారిణి మాత్రం.. మోడీ ప్రసంగాన్ని .. లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని కేంద్రం విచారణ జరిపి నిర్ధారించుకుని ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ…పాటించలేన్న కారణంగా.. ఆమెపై… క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లుగా.. కేంద్రం తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే వసుమతి.. మోడీ స్పీచ్‌ను టెలికాస్ట్ చేయలేదని.. తెలుస్తోంది. దానికి కారణం…మోడీపై ఉన్న వ్యతిరేకతేనని ప్రచారం జరుగుతోంది.