పనామా పేపర్స్ రూపంలో వెల్లడైన కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు కూడా పాత్ర ఉన్నదని తొలినుంచి వైసీపీ నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటిదాకా వారు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేక పోయారు. కానీ తొలిసారిగా.. వారికీ మరింత జోరుగా నిందలు వేయడానికి ఒక అవకాశం దొరికింది. చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న మోటపర్తి శివ రామ వరప్రసాద్ కు విదేశాలలో పెట్టుబడులు ఉన్నట్లుగా తేలుతున్నది. ఆఫ్రికాలోని ఘనా, టోగో లలోని కంపనీ లలో ప్రసాద్ కు పెట్టుబడులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పనామా పేపర్స్ వెల్లడిస్తున్న వివరాల్లో అయన పేరు మూడు సార్లు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఘనా పౌరసత్వం ఉన్న ప్రసాద్ తనకు ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయని అంటున్నారు. ఘన, టోగో లతో పటు అమెరికా ఇంకా పలు దేశాల్లో కూడా తనకు పెట్టుబడులు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ లీగల్ గానే ఉన్నాయని అంటున్నారు. 30 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న అయన తన పెట్టుబడులు అన్నీ సక్రమమే అంటున్నారు.
తాజా వివాదంతో ముడి పడి ఉన్న మొసాక్ ఫోనెస్కా తమ పెట్టుబడుల ఏజెంట్ అవునా కాదా అనే సంగతి తనకు తెలియదని, ఆ విషయం తమ లాయర్లు చూస్తుంటారని అంటున్నారు.
మొత్తానికి చంద్రబాబు హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తీ పేరు పనామా పేపర్స్ లో రావడం అనేది ముందు ముందు మరింత వివాదంగా మరవచ్చునని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు కు ప్రమేయం ఉన్నట్లు దీనిని బట్టి చెప్పలేము గాని, అయన మీద రాజకీయ ప్రత్యర్థులు బురద చెల్లదానికి ఇది తప్పకుండా ఉపయోగ పడుతుంది.