తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు కేసుల్లో ఒకే రోజు ఇద్దరు కిరాతకులకు కోర్టులు ఉరి శిక్షలు విధించాయి. నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి పోక్సో కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చిన పోక్సోకోర్టు… విడివిడిగా తీర్పు ఇచ్చింది. రెండు కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 24న శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. హతమైన బాలికల్లో ఒకరైన శ్రావణి కేసుల్లో బలమైన ఆధారాలు లభించడంతో.. పోలీసుల పని సులువు అయింది. మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని నేరస్థుడిగా నిరూపించారు. సైంటిఫిక్‌గా రుజువుకావడంతో కల్పన, శ్రావణి కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేశారు.
ఫిర్యాదు ఆలస్యం కావడంతో మనీషా కేసులో శ్రీనివాస్‌రెడ్డికి జీవిత ఖైదు విధించారు. హత్యల కేసులో 90 రోజుల్లోనే పోలీసుల విచారణ పూర్తి చేశారు. 50 పనిదినాల్లో కోర్టు విచారణ పూర్తి అయింది. హాజీపూర్ కోర్టు తీర్పు రాక ముందే… నెల్లూరులో ఓ తల్లీకూతుళ్ల హత్య కేసులో సంచలన తీర్పును అక్కడి కోర్టు వెలువరిచింది. ప్రధాన నిందితుడు షేక్ ఇంతియాజ్‌కి ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 12న హరినాధపురంలో తల్లీకూతుళ్ల హత్య జరిగింది. విచారణ ఆలస్యం అయినప్పటికీ.. ఉరిశిక్ష ఖరారయింది. దేశవ్యాప్తంగా.. నిర్భయ హత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష విషయంలో… చర్చ జరుగుతున్న సమయంలో… మరో ఇద్దరు కర్కోటలకు… తెలుగు రాష్ట్రాల్లో ఉరి శిక్ష విధించడం… యాధృచ్చికమే. అయితే… ఉరి శిక్ష విధించారు.
కానీ.. అది ఇప్పుడల్లా అమలమవుతుందన్న నమ్మకాన్ని మాత్రం…ఎవరూ వ్యక్తం చేయలేకపోతున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష వరకూ.. వారికి… ఏళ్ల పాటు… సజీవంగా ఉండేందుకు న్యాయ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే బాధితుల్లో అసహనం వ్యక్తమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
.