2017 వెళ్లిపోయింది. వెళ్తూ.. వెళ్తూ.. డిసెంబరులో ఏకంగా 25 సినిమాల్ని ఇచ్చింది. అయితే వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా `సూపర్ హిట్` అనిపించుకోలేదు. యావరేజ్‌లు బిలో యావరేజ్ లే దక్కాయి. డిసెంబరు 1న `జవాన్` వచ్చింది. జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ జవాన్.. బాక్సాఫీసు దగ్గర వసూళ్లని దక్కించుకోవడంలో విఫలమైంది. సప్తగిరి ఎల్ ఎల్ బీ, ఇది మా ప్రేమకథ, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్… ఇవన్నీ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. మళ్లీ రావా.. ఓకే అనిపించుకుంది. డిసెంబరు 14, 15లలో ఏకంగా 12 సినిమాలొచ్చాయి. అన్నీ ఫ్లాపులే. ఎంసీఏకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అయితే ఇదీ రొటీన్ స్టోరీ కావడం నిరాశ పరిచింది. హలో కి ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోవడంతో ఇది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా నిలిచిపోయింది. ఒక్క క్షణం కూడా బిలో యావరేజ్ స్థాయిలోనే ఉంది. డిసెంబరులో సినిమాలకు కొదవ లేకపోయినప్పటికీ… ఆశించిన వసూళ్లు రాకపోవడం, ఆడతాయనుకున్న సినిమాలు నిరాశ పరచడంతో… ఈ నెలంతా వెలవెలబోయింది. ఓవర్సీస్లోనూ ఒక్క సినిమాకీ సరైన రిటర్న్స్ రాలేదు.