2017 ముగుస్తోంది. కొత్త యేడాదిని ఆహ్వాచించే ఏర్పాట్లలో మునిగిపోయింది చిత్రసీమ. 2017లో ఎలాగైనా తమ సినిమాల్ని విడుదల చేసుకోవాలన్న తపనతో ఉన్నారో, లేదంటే సంక్రాంతి సీజన్ కంటే ముందే తమ సినిమాల్ని వదిలేయాలని అనుకొంటున్నారో తెలీదు గానీ నాలుగైదు వారాలుగా చిన్న సినిమాల జోరు ఎక్కువైంది. ప్రతీవారం మూడు నుంచి నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఈ వారం కూడా ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ఆ ఆరు సినిమాలూ.. ఆరు జోనర్లలో ఉండడం విశేషం. విక్రమ్ – సమంతల డబ్బింగ్ సినిమా ’10’ డిసెంబరు 15న విడుదల కాబోతోంది. తమిళంలో ఈ సినిమా ఫ్లాప్. మరి ఏ దైర్యంతో తెలుగులో విడుదల చేస్తున్నారో. రమ్యకృష్ణ ‘మాతాంగి’ ఈ వారమే వస్తోంది.ప ‘ఇది మా ప్రేమకథ’, ‘కుటుంబ కథా చిత్రమ్’, `జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్`, ‘సీత రాముని కోసం’ ఇవన్నీ ఈ వారమే రాబోతున్నాయి. ఈ ఆరింటిలో కొన్ని ప్రేమకథలు, కొన్ని థ్రిల్లర్లు ఉన్నాయి. నవీన్ చంద్ర ‘జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్’ కి పెద్దగా పబ్లిసిటీ దొరకడం లేదు. మిగిలిన సినిమాలదీ అదే దారి. కొంతలో కొంత ‘కుటుంబ కథా చిత్రమ్’ బెటర్‌గా అనిపిస్తోంది. స్టార్ సినిమాలు లేకపోవడం, గతవారం విడుదలైన చిత్రాలకు ఆదరణ లభించకపోవడంతో ఆరు సినిమాలు విడుదల అవుతున్నా – ఈవారం కూడా బాక్సాఫీసు కాస్త డల్‌గానే ఉండేట్టు కనిపిస్తోంది. వచ్చే వారం ‘హలో’. ‘ఎంసీఏ’ వస్తున్నాయి. బాక్సాఫీసు కళకళలాడాలంటే అప్పటి వరకూ ఆగాలి.