పార్లమెంట్లో అమిత్ షా… పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ధీరోధాత్తమైన ప్రకటన చేశారు. దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసంటూ.. సంచలన ప్రకటన చేశారు. దేశంలో అందరి చూపు.. ఇప్పుడు.. పీవోకేపై పడింది. పీవోకే ని .. పాకిస్తాన్ చెర నుంచి విడిపించడానికి ఏం చేయబోతున్నారనే ఆసక్తి అంతటా ప్రారంభమయింది. పీవోకేని ఎలా స్వాధీనం చేసుకోవాలన్నదానిపై.. టీవీ9 చానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయాలకు తావు లేకుండా.. వాదోపవాదాలకు చాన్సే లేకుండా… వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సాగిన.. టీవీ9 చర్చా కార్యక్రమం… వీక్షకులను ఆకట్టుకుంది.
ఉగ్రవాదం అంతానికి పీవోకే స్వాధీనం చేసుకుని తీరాలి..!
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందే. పీవోకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. అక్కడి నుంచే… కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. అందుకే.. పీవోకేను తిరిగి పొందాలన్న కృతనిశ్చయంతో.. కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు కూడా.. మోడీ, షా నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దౌత్య పరంగా.. చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే.. ఇతర మార్గాలను రెడీ చేసుకోవాలంటున్నారు. కశ్మీర్‌పై… మధ్యవర్తిత్వానికి రెడీ అంటున్న ట్రంప్‌ను ఇందులోకి లాగానే కేంద్రం అనుకుంటోంది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని వెనక్కి ఇచ్చెయ్యాలని ఇమ్రాన్ ఖాన్‌కు ట్రంప్ సూచించేలా చేయాలని భావిస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఓకేను వెనక్కి తీసేసుకోవాలని, అందులో మూడో దేశ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం ఆమోదించారు. ఇప్పుడా తీర్మానం పక్కన పెట్టి.. కొత్త తీర్మానం చేసే అవకాశం ఉంది. దౌత్య పరంగా ఇదో ముందడుగు అవుతుంది.
పీవోకే కోసం ప్రాణాలిస్తామన్న షా మాటల్లో పట్టుదల ..!
చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మళ్లీ భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రాణాలైనా అర్పిస్తామని అమిత్ షా ఎమోషనల్ గా ప్రకటించడం భారత సర్కార్ ఉద్దేశాన్ని చాటి చెబుతోంది. అయితే పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. ట్రంప్ చెప్పినా… కూడా.. పాకిస్తాన్ తమ భూభాగంగా భావిస్తున్న పీవోకేను.. సర్వనాశనం చేయడానికైనా అంగీకరిస్తుంది కానీ.. అప్పగించదు. సేనలు నేరుగా ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లిపోవడం మినహా వేరు గత్యంతరం కూడా లేదు. ఇప్పటికే రెండు సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు.. పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోది. గాయపడిన పాకిస్థాన్ గట్టిగా బదులిచ్చేందుకే ప్రయత్నిస్తుంది. పైగా అమిత్ షా ….ఆక్సాయ్ చిన్ వ్యవహారాన్ని ప్రస్తావించినందువల్ల చైనా కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భారతదేశమే మొదట దాడి చేసిందన్న అపవాదు రాకుండా చూసుకోవడం ప్రపంచదేశాల మద్దతు పొందడంలో కీలకం.
అంతర్జాతీయ మద్దతు పొందే వ్యూహాత్మత చతురత…!
ఆక్రమిత కశ్మీర్‌పై చేయి వేస్తే ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటుగానే స్పందించారు. ఇరు వర్గాలు విజయం ప్రకటించుకోలేని అత్యంత భయానకమైన యుద్ధం వస్తుందంటూ ఆయన హెచ్చరికలు కూడా చేశారు. ఆక్సాయ్ చిన్ వ్యవహారాన్ని ప్రస్తావించిన వెంటనే చైనా కూడా తవ్ర స్థాయిలో స్పందించింది. భారత ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించింది. కశ్మీరీలకు సాయం చేయడానికి ఎంతకైనా తెగిస్తామని పాక్ సైన్యం ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై కాలుదువ్వేపనిలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో.. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకినా చేసి.. మద్దతు పొందడం.. భారత్‌కు ముఖ్యం. అయితే.. మోడీ , షాల నేతృత్వంలో అది పెద్ద విషయం కాదు. ఆర్టికల్ 370 వ్యవహారంలో.. భారత్‌కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్ ఏకాకిగా మారుతోంది. ఇదే వ్యూహం పీవోకే విషయంలోనూ అమలు చేయవచ్చు.
మోడీ , షా చేసి చూపిస్తారు..!
పీవోకేను.. భారత్‌లో చేర్చితే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే.. దేశ విభజన నాటి నుంచి.. సరిహద్దుల్ని ఉద్రిక్తతంగా ఉంచుతూ.. వస్తున్న.. సీమాంతర ఉగ్రవాదం… అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది. చైనా కూడా.. భారత్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే భావనకు వస్తుంది. మోడీ, షా ఇది చేసి చూపిస్తారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు.