బోల్డ్ అండ్ బ్యూటీ, మోడల్, ఫ్యాషన్ ఐకాన్, బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పడుకునే కి బర్త్ డే విషెస్. విలక్షణ నటనతో, వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ఫాన్స్ హార్ట్స్ బ్రేక్ చేసిన దీపిక ఇవాళ్టితో 35 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తండ్రి విఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పడుకునే. దీపిక 1986 జనవరి 5న డెన్మార్క్ కోపేన్ హాగెన్ ప్రాంతంలో జన్మించింది. ఆమె 11 నెలల వయసులో ప్రకాష్ పడుకునే కుటుంబం కర్ణాటక బెంగళూర్ కి వచ్చింది.
దీపిక మంగలోరియన్. మాతృభాష కొంకిని. సోదరి అనిషా దీపిక కన్నా 5 ఏళ్ళ చిన్న. తండ్రి ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా దీపిక కి చదువంటే అమితాసక్తి. కాలేజీ లో చదువుతుండగా ఆమె మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.
లిటిల్, లింకా, నెస్కేఫ్,ఫియమా, డి వెల్స్, పెప్సీ, సోనీ సైబర్ షాట్ తదితర వాణిజ్య ప్రకటనల ద్వారా దీపిక ప్రసిద్ధురాలు.
2006 లో ఆమె మొట్టమొదటి కన్నడ చిత్రం ఐశ్వర్య ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనది. ఈ చిత్రంలో హీరో ఉపేంద్ర కూడా నటించారు.
2007 లో బాలీవుడ్ లో ఆమె షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం ద్వారా ఆమె అనేక పురస్కారాలు, అవార్డులు, విమర్శకుల ప్రసంశలు, ఫిలిం ఫేర్ బెస్ట్ ఫీమేల్ అవార్డు అందుకుంది.
2008లో సిద్దార్ధ్ ఆనంద్ బచనా ఏ హసీనా ఆమెకి ఎంతో పేరు తెచ్చింది. 2009లో కేం చాందిని చౌక్ తో చైనా, ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా అదే సంవత్సరం లవ్ ఆజ్ కల్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
2010లో కార్తీక్ కాలింగ్ కార్తిక్ సినిమా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది. అదే సంవత్సరం లఫెంగే పరేండే చిత్రం పేరు తెచ్చింది. అదే సంవత్సరం హౌస్ ఫుల్ కూడా సక్సెస్ ఇచ్చింది. ఇలా ఆమె అనేక చిత్రాలు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
2018 నవంబర్ లో దీపిక రణ్వీర్ సింగ్ ని వివాహమాడింది.