సెలెబ్రిటీలకు ఎప్పుడు ఎవరిమీద ప్రేమ పుడుతుందో, అది ఎప్పుడు పుటుక్కుమంటుందో అంతా పజిల్. గాఢ ప్రేమికులు కాస్తా భగ్న ప్రేమికులు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. సరే, బాలీవుడ్ లో లేటెస్ట్ క్యూటెస్ట్ లబ్ పెయిర్ దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ చెట్టపట్టాలేసుకుని షికార్లు చేస్తున్నారు. ఇద్దరికీ షూటింగ్ గ్యాప్ దొరికింది కాబట్టి ఏకాంతంగా కొన్ని రోజులు గడపాలని నిర్ణయించారట. ఏ దేశానికి వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగివస్తారనేది ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ హాలిడే టూర్ ప్లాన్ చేశారట.
ప్రియాంక బుడాపెస్ట్ లో ఓ ఐటమ్ సాంగ్ బిజీలో ఉంది. రాబ్తా సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. ఆ షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైకి తిరిగివచ్చింది. పారిస్ లో బేఫిక్రే షూటింగ్ లో ఉన్న రణవీర్ అది పూర్తి చేసుకుని తిరిగివచ్చాడు.
ఇప్పుడు ఈ అందమైన ప్రేమజటం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదట. అభిమానుల సందోహం, మీడియా కెమెరాలకు దూరంగా ఎక్కడో ఏకాంతంగా కొన్ని రోజులు గడపాలని వీరిద్దరూ చాలా రోజులుగా అనుకుంటున్నారట. కానీ ఎవరి షూటింగ్ బిజీలో వాళ్లు ఉండటం వల్ల ఇప్పటి దాకా కుదరలేదు. ఇన్నాళ్లకు వీళ్ల ప్లాన్ అమలైంది.
ఏముహూర్తాన వీరిద్దరూ రామ్ లీలా సినిమా ఒప్పుకున్నారో గానీ అప్పటి నుంచీ బాలీవుడ్ లో ఒకటే సందడి చేస్తున్నారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రొమాంటిక్ సీన్లకు పూర్తిగా న్యాయం చేశారు. కెమెరా ముందే రెచ్చిపోయి రొమాన్స్ చేశారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్ అని టాక్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. అయితే షూటింగ్ కాబట్టి తరచూ ఒకరు ఒక దేశంలో మరొకరు మరో దేశంలో బిజీగా ఉండక తప్పదు. కాబట్టి ఇప్పుడు దొరికిన షూటింగ్ గ్యాప్ లో కనీసం ఓ వారమైనా తనివితీరా ఏకాంతవాసాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నారట దీపిక-సింగ్.