ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 15న విడుదల తేదీ ప్రకటించారు. అంతకంటే ఓ రోజు ముందే రావొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే… ఈ సినిమా ఇంకా రెడీ కాలేదు. ఓ పాట బాకీ. ఆ పాట ఇప్పుడు హైదరాబాద్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ పాట రేపటితో పూర్తవుతుంది. ఆ తరవాత.. ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్, డీఐ ఇవన్నీ జరగాలి. అవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో మరి.
ఈ పాట తప్ప సినిమా అంతా ఎప్పుడో పూర్తయిపోయింది. కాబట్టి.. సమస్యలేం లేకపోవొచ్చు. కానీ.. ఆఖరి రోజుల్లో పాట చిత్రీకరణ పెట్టుకోవడం ఏమిటో? నిజానికి ఈ పాట నాలుగు రోజుల క్రితమే పూర్తి కావల్సివుంది. ఓ పాట కోసం… కశ్మీర్ వెళ్లింది చిత్రబృందం. అక్కడ అనుకోకుండా స్ట్రక్ అయిపోవడంతో సకాలంలో… హైదరాబాద్ రాలేకపోయారు. ఆ ఇబ్బందులన్నీ తొలగి శుక్రవారం చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. అప్పటికే సెట్ రెడీ చేసి పెట్టడంతో…ఆఘమేఘాలమీద ఈ పాటని మొదలెట్టేశారు.