కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌కు గొప్ప ఊరట లభించింది. ఆయన భారయ సునంత పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఇంత కాలం ఆయన కేసును ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టి వేసింది. 2014వ సంవత్సరం జనవరి 17న శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. హత్య జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే దర్యాప్తు జరిపిన పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు.
కానీ ఆత్మహత్యకు కారణం శశిథరూర్ అని ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. సునందను శశిధరూర్ టార్చర్ పెట్టారని ఇతరర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన వల్ల మానసిక క్షోభను అనుభవించారని పోలీసులు కోర్టులో వాదించారు. అయితే సునంద ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. కోర్టులో శిశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశ పెట్టలేకపోవడంతో ఢిల్లీ కోర్టు శశిథరూర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. వర్చువల్ పద్దతిలో కోర్టుకు హాజరైన శశి థరూర్ తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఏడున్నర సంవత్సరాలు పడుతోన్న ఈ బాధకు విముక్తి లభించందన్నారు.
శశిథరూర్‌కు సునంతతో మూడో పెళ్లి. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థానంలో పని చేసిన శశిథరూర్ తర్వాత ఇండియాకు వచ్చి రాజకీయాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కేరళ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. మంచి ప్రతిభావంతునిగా పేరున్న శశిథరూర్ పై సునంద ఆత్మహత్య ఘటనతో బీజేపీ ఆయనను ఇబ్బంది పెట్టాలని అనుకుందని కాంగ్రెస్ నేతలు గతంలో విమర్శలు చేసేవారు.