డిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా వచ్చాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. జాతీయ మీడియా టీవీ చానళ్లు, వాటికి ఎగ్జిట్ పోల్స్ చేసి పెట్టిన సంస్థలు చాలా వరకూ రిస్క్ ఎందుకు అని భారతీయ జనతా పార్టీకే జై కొట్టాయి. హర్యానా, మహారాష్ట్ర అనుభవం తర్వాత చాలా సంస్థలు రిస్క్ తీసుకోవడం లేదు. బయటకు ఇతర పార్టీలకు సానుకూలత కనిపిస్తున్నా ఎందుకైనా మంచిదని బీజేపీకే మెజారిటీ ప్రకటిస్తున్నాయి.
కాస్త పేరున్న చానళ్లన్నీ పోరు కాస్త టైట్ గా ఉన్నప్పటికీ విజయం మాత్రం బీజేపీదేనని తేల్చాయి. 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 40 సీట్లు బీజేపీకి ఖచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు సోదిలో లేదని అన్ని ఎగ్దిట్ పోల్స్ ప్రకటించారు. అతి కష్టం మీద ఒకటి రావొచ్చని లేకపోతే అదీ కూడా లేకపోవచ్చని అంచనా వేఏశాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ గత పదకొండేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్న ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీకి వచ్చే సరికి పూర్తిగా కేజ్రీవాల్‌కే మద్దతు పలుకుతున్నారు. ఇటీవల ఆయన అవినీతి కేసులో జైలుకు వెళ్లడం. తర్వాత రాజీనామా చేయడం వంటి పరిణామాలతో ఆయన పలుకుబడి తగ్గిపోయిందని అంచనా వేస్తున్నారు.