మోడీకి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చి పెట్టింది గుజరాత్ మోడల్ అభివృద్ది. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించక ముందు నుంచే గుజరాత్ మోడల్ బాగా పాపులర్ అయింది. గుజరాత్ అభివృద్ధి పేరుతో విస్తృతంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అయ్యేవి. గుజరాత్ సీఎంగా దాదాపు 12 ఏళ్లకు పైగాపనిచేసిన నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని ప్రగతిదిశగా పరుగులు పెట్టించారని, అభివృద్ధిలో దేశానికి నమూనాగా మలిచారని కమలనాథులు గుక్క తిప్పుకోకుండా చెబుతుంటారు. ఆ ప్రచారంతోనే 2014జనరల్ ఎలక్షన్ లో విజయం సాధించి కేంద్రం లో అధికారం చేపట్టారు. ఇప్పటికీ గుజరాత్లో అభివృద్ధిపై కథలు..కథలుగా సోషల్ మీడియాలోప్రచారం జరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు గుజరాత్ మోడల్ తరహాలోనే ఢిల్లీ మోడల్ కూడా వైరల్ అవుతోంది. అయిదేళ్లలో ఢిల్లీలో తాను చేపట్టిన అభివృద్ధిని దేశ ప్రజల ముందుపెట్టి ఢిల్లీ మోడల్‌గా ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుసు. అయితే అందులోనూ ఫేక్ వే ఎక్కువ ఉన్నాయన్నఆరోపణలు కూడా ఉన్నాయి. అయితేకేజ్రీవాల్పై క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ కారణంగా ఆయన మోడల్ ప్రచారంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తన ఆధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.సోషల్ మీడియా లో ఆప్ కోసం పని చేసే స్వచ్చంద దళంఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఎలాగైతే ప్రచారం చేసిందో ఇక ముందు అదే స్థాయిలో ఢిల్లీ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేసి.. దేస వ్యాప్తంగా రాజకీయంగా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
గుజరాత్లో పారిశ్రామికవేత్తలు.. వ్యాపారవేత్తలు ఉన్నారుకానీ గుజరాత్ లో అభివృద్ధి ఏమీ లేదని ఇటీవలి కాలంలో కొంత మంది పరిశోధనలు చేసిచెప్పడం ప్రారంభించారు.. గుజరాత్ ఆర్థిక వ్యవస్థ ప్రచారం జరుగుతున్నంత బలంగా లేదు. ప్రధానిగా మోడీ ఏడేళ్ల పాలనలో గుజరాత్ మోడల్‌ను అమలు పరిచామని బీజేపీ ఇప్పటికీ గట్టిగా ప్రచారం చేసుకోకపోవడం … గుజరాత్ మోడల్ అనేది ఉత్త ప్రచారమేనని చెప్పే వారికి అస్త్రంగా మారింది. ఢిల్లీ మోడల్ పేరుతో విస్తృతంగా ప్రచారం అవుతున్న అభివృద్ది కార్యక్రమాలు.. ఇతర అంశాలు నిజమో కాదో.. ఎవరైనా బయట పెడితేనే తెలుస్తుంది. కానీ.. ఇప్పటికైతే… గుజరాత్ మోడల్ వర్సెస్ ఢిల్లీ మోడల్ అనే సీన్ క్రియేట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.