ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కి ఢిల్లీ లె్ఫ్టినంట్ గవర్నర్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్ పార్టీ తరపున ప్రకటనలు ఇచ్చారని.. వందలకోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపిస్తూ ఆప్ చీఫ్ అయిన ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ. 163.62 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ నగదును చెల్లించాలని నోటీసులు పంపింది. ఆ ప్రకటనల ఖర్చులు వసూలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. నగదు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రచారం పేరుతో.. దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇస్తుంది. విస్తృతంగా ప్రచారానికి ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఈ సొమ్మంతా .. ప్రభుత్వ ప్రచారానికి కాదని.. పార్టీ ప్రచారానికని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చెబుతున్నారు. అ కోణంలో ఆలోచిస్తే.. ఏపీలో ప్రభుత్వం ప్రచారానికి ఖర్చు పెట్టే ప్రతీ పైసా .. వైసీపీ పార్టీ కోసమే అన్నట్లుగా ఉంటుంది. అంతే కాదు.. ఈ ఖర్చులో అత్యధిక భాగం వైసీపీ పార్టీ అధినేత కుటుంబానికి చెందిన మీడియాకే వెళ్తుంది. ప్రభుత్వం తరపున ఇచ్చే ఏ ఒక్క ప్రకటన కూడా..ప్రభుత్వానిదిలా ఉండదు. పూర్తిగా వైసీపీరంగులతో ఉంటుంది. విపక్షాలపై విమర్శలు.. తప్పుడు సమాచారంతో ఉంటుంది. గత ప్రభుత్వం.. మన ప్రభుత్వం అంటూంటారు… కానీ గతంలోనూ ప్రజా ప్రభుత్వం అని చెప్పరు. అంటే.. పూర్తిగా అది వైసీపీ పార్టీ ప్రకటనలు.
అదే సమయంలో బహిరంగసభలు పెట్టే సీఎం జగన్ పూర్తిగా రాజకీయ ప్రసంగాలే చేస్తారు. తనను మళ్లీ ఆదరించాలని కోరుతూంటారు. అంటే.. అది ఎన్నికల ప్రచారమే. ఇదంతా ప్రజాధనంతో నిర్వహిస్తున్న నిర్వాకమే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గ వర్నర్కు కనిపిస్తున్న తప్పు.. ఏపీలో గవర్నర్ కు కనిపించడం లేదు. ఇదొక్కటే కాదు.. స్వయంగా గవర్నర్ ను హామీగా పెట్టి… అప్పు తెచ్చారని తెలసినా ఆయన ఏమీ అనలేకపోయారు. కారణం ఏదైనా.. ఇప్పుడు వైసీపీ నుంచి ప్రచారానికి చేస్తున్న ఖర్చులను రికవరీ చేయడానికి ఓ చాయిస్ ఉందని… చాన్స్ ఉందని బీజేపీ గవర్నర్ నిరూపించారు. ఇది చాలు భవిష్యత్లో వైసీపీ దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికన్న వాదన ఇప్పటికే వినిపించడం ప్రారంభమయింది.