ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తులకు ఉండే ప్రోటోకాల ప్రకారం వారి ఇంట్లో ఎవరూ సోదాలు చేయలేరు. కానీ రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా బయట పడక తప్పదన్నట్లుగా వారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో అసలు విషయం వెలుగు చూసింది. 14వ తేదీన ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిది. ఆ సమయంలో న్యాయమూర్తి ఇంట్లో లేరు. కుటుంబసభ్యులు వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.
పైర్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పి.. పాక్షితంగా తగలబడిన వాటిని కిందకు తీసుకువచ్చి పడేసే క్రమంలో ఓ గదిలో పేర్చిన నోట్ల కట్టల గురించి కనుగొన్నారు. అప్పటికీ కొంత నగదు కాలిపోవడంతో వివరాలను ఉన్నతాధికారులకు ఇచ్చారు. వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సమాచారం ఇచ్చారు. అయితే ఇవాల్టి వరకూ ఈ విషయం వెలుగులోకి రాలేదు. చివరికి యశ్వంత వర్మను అలహాదాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం నిర్ణయం తీసుకుంది. అయన అక్కడి నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు.
సుప్రీంకోర్టు కొలిజియం జస్టిస్ యశ్వంత్ వర్మను రాజీనామా చేయమంటే తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనపై విచారణకు ముగ్గురు జడ్జిల కమిటీని నియమించారు. ఆయన రాజీనామాను ఆమోదించకపోతే పార్లమెంట్ ద్వారా అభిశంసించే అవకాశం ఉంది. గతంలోవైసీపీ నేతలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలబపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసేవారు. శాంతి విషయంలో ఆమె భర్త విజయసాయిరెడ్డిపై చేసిన విషయంలో కూడా విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్ వేశారు.