ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, ,బోయినపల్లి అభిషేక్‌లను అరెస్ట్ చేశారు. వారాలు గడిచిపోతున్నా వారికి బెయిల్ రావడం లేదు. తాజాగా ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఆయనకు ఢిల్లీ కోర్టు మూడు రోజుల కస్టడీకి కూడా ఇచ్చింది. సీబీఐ , ఈడీలు చేస్తున్న ఈ అరెస్టులు … వ్యూహాత్మకంగా ఉన్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ అంతా ఒకరి లబ్ది కోసమే జరిగిదంని… వారు బినామీలని.. ఆ సంగతి స్పష్టంగా ఆధారాలు ఉండటంతోనే … దాన్ని ఫోకస్ చేసేందుకు ముందుగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. చార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట వంటి వారి ప్రమేయం గురించి ప్రస్తావించారు కానీ.. వారిని ఇంకా సీబీఐ కానీ ఈడీ కానీ నిందితులుగా చేర్చలేదు. కానీ అసలు లబ్ది పొందిన వారు… ఈ స్కాంకు స్కెచ్ వేసిన వారు చివరికి ప్రధాన నిందితులవుతారు. ఈ విషయాన్ని ఎక్స్ పోజ్ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
రాజకీయంగా కూడా సున్నితమైన కేసు కాబట్టి… ఎక్కడా విమర్శలు అనుమానాలు రాకుండా దర్యాప్తు సంస్థలు… వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని .. లభిస్తున్న సాక్ష్యాల ప్రకారమే ముందుకు వెళ్తున్నాయన్న అభిప్రాయం కల్పించేలా… కొసరు అరెస్టులు చేస్తున్నారని… అంటున్నారు. స్కామ్ లో వీరి ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టులో ప్రవే శ పెడుతూ.. వీరి వెనుక ఎవరు ఉన్నారన్న అంశాన్ని పకడ్బందీగా కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారని అంటున్నారు. చివరికి అసలు టార్గెట్ వద్దకు వస్తారంటున్నారు.
కేసు మెరిట్స్ ను చూస్తే ఇప్పటి వరకూ మొదట్లో ప్రధానంగా ఆరోపణలు వచ్చిన వారిపై దర్యాప్తు సంస్థలు ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ విషయంలో దర్యాప్తు సంస్థలు ఇంకా కింది స్థాయి అరెస్టులు చేస్తున్నాయి. అందుకే తర్వాత ఎవరు అరెస్టు అవతారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంకా అరుణ్ పిళ్లై లాంటి ఒకరిద్దరు ఉన్నారని.. వారి తర్వాత అసలు టార్గెట్ ను అరెస్ట్ చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.