ఏదో అనుకుంటాం కానీ.. వారి ప్రభావం.. వారి కబ్జాలు అంతే అని.. కానీ ఊహించనంత దూరం వెళ్తాయి. విశాఖ కేంద్రంగా ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. పెనాక శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీలో .. లిక్కర్ స్కాంలో కింగ్‌పిన్‌గా భావించి అరెస్ట్ చేసిన వ్యక్తే..ఆయన. ఆయన అరబిందో సంస్థల వారసుడు మాత్రమే కాదు.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లోను దొరికిపోయి.. జైలుకెళ్లాడు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు సంపాదించుకుంది. చివరికి అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా తీసుకుంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఇతర బలమైన సంఘాలపైనా దృష్టి పెట్టారు. అధికారబలంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌నూ సొంతం చేసుకున్నారు. అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డిని ఏసీఏ అధ్యక్షుడిగా నియమించుకోవడంలో తనదైన రాజకీయం చూపించారు. జగన్ అధికారం చేపట్టిన కొన్నాళ్లకే ఆయన ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు.
ఆయన ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యాక.. అప్పటి వరకూ మంగళగిరిలో అంతర్జాతీయ…స్థాయి లో జరుగుతున్న స్టేడియం నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు శిథిలం అవుతున్నాయి. ఏసీఏ వ్యవహారాలు పడకేశాయి. అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయనే జైలుకెళ్లారు. ఇలాంటి రాజకీయ నేతలు … క్రీడాసంఘాల్లోనూ వేలు పెడితే.. చివరికి వాటికీ అవినీతి మరక అంటడం తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏసీఏలోనూ అదే జరుగుతోంది.