దేశంలో అతి కొద్ది మంది కి మాత్రమే ఉన్న ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న నేత చంద్రబాబునాయుడు. ఏపీలో ఆయనపు కుట్రలు జరుగుతున్నాయని ఇటీవల భద్రతను రెట్టింపు చేశారు. అయితే పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఆయనకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆనుమానాలు ఎన్ఎస్జీలో బలంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు వెళ్లిన ప్రతీ చోటా పోలీసులే ఆటంకాలు కల్పిస్తున్నారు. ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. అంతా చేసి చంద్రబాబు భద్రత కోసమే చేశామని కబుర్లు చెబుతున్నాు.
ఇదంతా ఓ రాజకీయ కుట్ర అని ఎన్ఎస్జీ వర్గాలు భావిస్తున్నారు. ఏపీలో రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా అంతమొందించడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని మనస్థత్వం ఉన్న నేతలు పాలకులుగా ఉన్నారన్న అభిప్రాయం చాలా కాలంగా భద్రతా వర్గాల్లో ఉందిని చెబుతున్నారు. ప్రజాభిప్రాయం మారుతున్న సమయంలో… ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో వారికి ఇంకా ముప్పు ఎక్కువగా ఉంటుందని.. పోలీసులు కూడా .. ప్రతిపక్ష నేతలపై దాడుల కుట్రలకు సహకరించేలా పరిస్థితులు మారడంతో ఎన్ఎస్జీ మరింత అప్రమత్తమయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు భద్రతా సిబ్బంది ఢిల్లీకి నివేదిక పంపారు.
దీనిపై అంతర్గతగా ఏపీ పోలీసుల నుంచి ఎన్ ఎస్జీ వివరణ తీసుకునే అవకాశం ఉంది. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఇలా భక్షకులుగా వ్యవహరించడం మొదటి నుంచి సంచలనంగా మారుతోంది. కేసులున్న వ్యక్తి పాలనలో పోలీసులు అచ్చరమైన క్రిమినల్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తున్నాయి. ఈ వివరాలన్నీ చెబుతూ… రఘురామకృష్ణరాజు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. మొత్తంగా పోలీసులు ఈ వ్యవహారంలో ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.