ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇక తెలంగాణ మాత్రమే మిగిలింది. అన్ని పార్టీల నేతలూ తెలంగాణలో దిగిపోయారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా అందరూ తెలంగాణలోనే తిరుగుతున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున యోగి ఆదిత్యనాథ్ వంటి వళ్లూ వచ్చారు. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో కూడా అర్థం కానంత బిజీగా అందరూ తిరిగేస్తున్నారు.
ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం వరకూ ప్రచార గడువు ఉంది. అంటే ఇంకా రెండున్నర రోజులు మాత్రమే. అందుకే ఈ రెండున్నర రోజులూ అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ప్రధాని మోదీ ఇరవై ఏడో తేదీ వరకూ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. ప్రయాంక, రాహుల్ చివరి రోజు వరకూ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. గట్టి పోటీ ఉందనుకున్న నియోజకవర్గాల్లో అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రధాని మోదీ బీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ అని పిలుపునిచ్చారు. ప్రియాంకా గాంధీ మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలన్న నినాదం ఇచ్చారు. ఇతర అగ్రనేతలు.. మార్పు కోసం ప్రచారం చేస్తున్నారు. టీవీ చానల్స్ లో కూడా పూర్తిగా పెయిడ్ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు ప్రచార హోరు తర్వతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండనుంది.