హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లంప్ లోకి వెళ్లడానికి ప్రధాన కారణం… మార్కెట్ డిమాండ్ ను పట్టించుకోకుండా సప్లయ్‌ను బిల్డర్లు డిసైడ్ చేయడమే. అందరూ మూకుమ్మడిగా లగ్జరీ ఇళ్ల వైపు వెళ్లిపోయారు. కానీ మార్కెట్లో అసలు డిమాండ్ మాత్రం.. రూ. యాభై లక్షల లోపు విలువ చేసే ఇళ్లకే ఉంది. ఇల్లు కొనాలని అనుకుంటున్న వారిలో అరవై ఐదు శాతం మంది అదే
హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని చూసేవారిలో 65 శాతం మంది చాయిస్ రూ.50 లక్షల బడ్జెట్ పెట్టగలిగే ఇళ్లే. వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. అలాంటి ఇళ్ల సప్లయ్ తక్కువగా ఉండటంతో నిర్మాణం అయినవి అయినట్లుగా తమ్ముడు అయిపోతున్నాయి. కానీ రూ. కోటి అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్లు మాత్రం అమ్మకం కాక ఆగిపోతున్నాయి. వాటి వల్లే పెట్టుబడి అంతా స్ట్రక్ అయిపోతోంది. ఇలాంటి ఇళ్లకు డిమాండ్ పది శాతం ఉంటే.. కనీసం పాతిక శాతం ఇళ్లను అలాంటివే నిర్మిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో రూ. 50 లక్షల లోపు సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్న ఇళ్లు సగం కూడా ఉండటం లేదు. ఈ కారణంగా వాటికి డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ బిల్డర్లు మార్కెట్ డిమాండ్ ను పట్టించుకోకుండా… లగ్జరీ వైపు వెళ్లడమే స్లంప్‌కు ఓ ప్రధాన కారణంగాకనిపిస్తోందని అనుకోవచ్చు. ఇప్పటికైనా బిల్డర్లు రూటు మార్చి సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్లు నిర్మిస్తే..డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది.