పార్లమెంట్ లేదా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో ఎప్పుడైనా అర్థవంతమైన చర్చలు జరగడం చూశామా ?. రెండు పక్షాలూ హోరాహోరీగా తలపడటం… అధికారపక్షం తప్పించుకుపోవడానికి ప్రయత్నించకుండా విపక్షాల వాదన వినిపించే అవకాశం ఇచ్చి.. తాము సమధానం ఇచ్చేందుకు కూడా కష్టపడే సన్నివేశాల్ని ఇటీవలి కాలంలో చూశామా ?. లేనే లేదు.. కానీ ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సోమవారం అర్థరాత్రి దాటినా కొనసాగింది. పార్టీలు హోరాహోరీగా తమ వాదనలు వినిపించాయి.
నాడు అసెంబ్లీ అంటే హైవోల్టేజ్ చర్చలు
వైఎస్, చంద్రబాబు .. ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఎవరు సీఎం అయినా..ఎవరు ప్రతిపక్ష నేత అయినా అసెంబ్లీ సమావేశాలు హైవోల్టేజ్ లో సాగేవి. విపక్షాన్ని కంట్రోల్ చేయడానికి వైఎస్ కొన్ని సార్లు వ్యక్తిగత ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా… తర్వాత క్షమాపణలు చెప్పి సభ సాగేలా చూసేవారు. ఇలాంటి మంచి అసెంబ్లీ, పార్లమెంటరీ సంప్రదాయం… ఆ తర్వాత మారిపోయింది. వాయిదాలతో నడిచిపోయింది. అసెంబ్లీకి విలువ లేనట్లుగా అయిపోయింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి అసెంబ్లీలో చర్చలే కాదు.. అసలు జరిగిందే తక్కువ.
Read Also : ప్రతిపక్ష నేత లేకపోయినా తెలంగాణ అసెంబ్లీలో హాట్ డిబేట్స్
తెలంగాణ, ఏపీల్లో పదేళ్లలో తగ్గిన అసెంబ్లీల ప్రాధాన్యం
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన పదేళ్లలో వన్ సైడ్ అసెంబ్లీ మూకీ సినిమా నడిచింది. విపక్షాల వాయిస్ ను వినేందుకు.. ఆయన ఏ మాత్రం ఇష్టపడలేదు. సభ బయట ఎమ్మెల్యేల్ని ఆకర్షించారు. మిగిలినవారు లోపలికి వస్తే సస్పెండ్ చేసేశారు. దాంతో పదేళ్ల పాటు కేసీఆర్ చెప్పింది వినడమే అసెంబ్లీ అన్నట్లుగా సాగుంది. ఏపీలోనూ అంతే. మొదటి ఐదేళ్లు.. మంచి సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్… దుర్వినియోగం చేసుకున్నారు. చివరికి రెండేళ్లు బాయ్ కాట్ చేశారు. తరవాత టీడీపీకి అతి తక్కువ బలం ఉన్నప్పటికీ వారిని నోరెత్తకుండా చేసి బూతులందుకున్నారు. మిగిలిన వారిపై సస్పెన్షన్లు వేసి భజన చేసుకున్నారు.
తెలంగాణలో పూర్వ వైభవం.. ఏపీలో మాత్రం అంతే !
విషాదం ఏమిటంటే.. తెలంగాణ అసెంబ్లీకి మళ్లీ ప్రజాస్వామ్య కళ వచ్చింది . కానీ ఏపీ అసెంబ్లీకి మాత్రం ఈ సారి కూడా వచ్చే అవకాశం లేదు. ప్రజలివ్వని ప్రతిపక్ష నేత హోదా తకు ప్రభుత్వం ఇవ్వడం లేదని తాను అసెంబ్లీకి రానని ప్రకటించేశారు జగన్. ఆయన రాకపోతే ఆయన ఎమ్మెల్యేలు కూడా వెళ్లడానికి అంగీకరించరు. దీంతో ఈ ఐదేళ్లు.. ఏపీ అసెంబ్లీలో ప్రజాస్వామ్య చర్చలే ఉండవు.
Read Also : అసెంబ్లీకి కేసీఆర్… తెర వెనుక పెద్ద స్కెచ్చే ఉందిగా!