జనసేన ప్లీనరీకి ఎక్కడా స్థలం దొరక్కుండా చేద్దామనుకున్న వైసీపీ పెద్దలకు ఇప్పటం గ్రామస్తులు షాక్ ఇచ్చారు. తమ పొలాలను జనసేన ప్లీనరీకి ఇచ్చారు. ఇప్పుడు వారికి ఏపీ ప్రభుత్వం.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది. గ్రామంలో 120 అడుగుల రోడ్ నిర్మిస్తామంటూ దారిలో ఉన్న ఇళ్లననింటినీ కూల్చేసింది. కనీస సమయం ఇవ్వకుండా కొత్తగా కట్టిన ఇళ్లను కూడా నిర్మోహమాటంగా బుల్డోజర్లతో కూల్చి వేయించారు. జనసేన ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకే ఇలా చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇటీవల ఇప్పటం గ్రామస్తులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ప్రభుత్వానికి భయపడకుండా ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్.. గ్రామానికి యాభై లక్షల విరాళం ఇచ్చారు. దాంతో వారు ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. అయితే… ఆ డబ్బులు సీఆర్డీఏకు జమ చేయాలని .. ప్రభుత్వం ఒత్తిడి చేసింది. వారు వినిపించుకోలేదు.. పవన్ కల్యాణ్ ఇచ్చిన వాటితో పాటు మరికొంత జమ చేసి.. కమ్యూనిటి హాల్ నిర్మహించుకున్నారు. అయితే దానికి బలవంతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పె్టటేశారు. దీంతో గ్రామ ప్రజలు ఇదేం దౌర్జన్యం అని ముుక్కన వేలేసుకోవాల్సి వచ్చింది.
సాధారణంగా గ్రామాల్లో 120 అడుగుల రోడ్లు ఉండవు. ఆర్ అండ్ బీ రోడ్లలో కూడా అతి తక్కువ రోడ్ే అంత స్థాయిలో ఉంటాయి. గ్రామంలో అంతర్గత రహదారులు కూడా 120 అడుగులు చేస్తామని చెప్పి.. ఇలా ఇళ్లు పగలగొట్టేస్తున్నారు. లఇదంతా రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని.. జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశం రాజకీయ దుమారం రేపే అవకాశం కనపిస్తోంది.