భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సంచలన విజయం నమోదు చేసింది. డెన్మార్క్ ఓపెన్ టోర్నీ సెమీస్ లో ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారిణిని ఓడించింది. ఫైనల్లో ప్రవేశించింది. ప్రత్యర్థి కరోలినా మారిన్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో విజయం సాధించింది.
తొలిసెట్లో సులభంగా నెగ్గిన సింధు, రెండో సెట్లో వెనకబడింది. మూడో సెట్లో పుంజుకుంది. సెట్ ను, మ్యాచ్ ను కైవసం చేసుకుంది. పవర్ ఫుల్ ఆటతీరుతో చెలరేగిపోయింది. 21-15, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో గెలిస్తే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ సింధు ఖాతాలో జమవుతుంది.
పీవీ సింధు 20 ఏళ్ల వయసులోనే అనేక విజయాలు సాధించింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిలచింది. గ్వాంగ్జూ, కోపెన్ హగన్ టోర్నీల్లో చాంపియన్ షిప్ సాధించింది. ఆసియా చాంపియన్ షిప్ టైటిల్ గెల్చుకుంది. కామన్ వెల్త్ లోనూ విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది ఇంతవరకూ అంతర్జాతీయ టైటిల్ ఏదీ గెలవలేదు. డెన్మార్క్ ఓపెన్ తో బోణీ కొడుతుందని భారతీయ అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.