డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వైసీపీ మార్క్ ప్రకటనల్లో రాటుదేలిపోతున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రైతులు .. టీడీపీ అధినేత చంద్రబాబుపై బండబూతులు తిట్టేసి..ఏ పర్వాలేదు..రికార్డింగ్ చేసుకోమని దిలాసా చెప్పిన కృష్ణదాస్..తాజాగా తన టంగ్ పవర్‌ను వ్యవసాయకూలీలపై చూపెట్టారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే వారిని సోమరులుగా అభివర్ణించారు. వారు రెండు గంటలు కులాసాగా గడిపి వెళ్లిపోతారని విమర్శించారు. ఉపాధి హమీ పనులకు వెళ్లే పేదలు… వ్యవసాయపనుల్లోకి రావడం లేదని… అందు వల్ల వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
వరి సాగు, పంట కోత సమయాల్లో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయని … కూలీలపై తన కసిని ధర్మాన కృష్ణదాస్అలా బయట పెట్టారు కూలీలపై కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం మండి పడింది. కృష్ణదాస్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిరసనలు ప్రారంభించారు. కృష్ణదాస్ కు మామూలుగానే నోటి దురుసు ఉన్న నేతగా పేరుంది. మంత్రి అయిన తర్వాత ఆయన నోటికి లైసెన్స్ వచ్చినట్లయింది. అదే సమయంలో వైసీపీ విధానం కూడా బూతులు తిట్టడమే అన్నట్లుగా మారిపోవడంతో.. ఆయనకు ఎదురు లేకుండా పోయింది.
చంద్రబాబును అభ్యంతరకంగా తిట్టడం ప్రివిలేజ్‌గా భావిస్తున్నారు. దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అమరావతి రైతులమీద అంతే పడ్డారు. వారిని కూడా అత్యంత దారుణంగా తిట్టారు. వైసీపీ సోషల్ మీడియాకు.. బూతు బ్రాండ్ ఉంది. దానికి తగ్గట్లే కింది నుంచి పై స్థాయి వరకూ దూషణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు.