ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ టూర్ కు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కావడంతో ముందుగా ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో పవన్ భార్య అన్నా లెజ్నోవా ఎకనామిక్స్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యూయేషన్ డే కార్యక్రమంలో పాల్గొని భార్య సంతోషంలో పాలు పంచుకునేందుకు పవన్ కూడా సింగపూర్ వెళ్లారు.
Read More : ఒట్టు .. అక్రమ సంబంధాల్లేవు : విజయసాయిరెడ్డి
పవన్ కల్యాణ్ మూడు రోజుల కిందట ఎయిర్ పోర్టులో ఫార్మ్ డ్రెస్ తో వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన హైదరాబాద్ వెళ్తున్నారని అనుకన్నారు. వారాహి దీక్షలో ఉండటంతో మొన్నటి వరకూ దీక్షా డ్రెస్ లోనే ఉన్నారు. అంబానీ ఇంట పెళ్లికి కూడా అదే డ్రెస్ లో ఉన్నారు. దీక్ష విరమించిన తర్వాత స్టైలింగ్ మార్చారు. భార్య గ్రాడ్యూయేషన్ ప్రోగ్రాంకు కాబట్టి స్టైలిష్ గా వెళ్లారని అర్థమవుతోంది.
అన్నా లెజ్ నోవా చదువుపై ఎంతో ఆసక్తిగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్, అన్నాపిల్లల ఫోటోలు కూడా ఇంత వరకూ బయటకు రాలేదు. వారు కూడా సింగపూర్‌లోనే చదువుతున్నారనే ప్రచారం ఉంది.