ఎస్టీలో ధంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రాజేసింది. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేయడాన్ని నిరసిస్తూ గిరిజన ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత ఆత్మహత్యయత్నం చేయడం ఒక్కసారిగా కలకలం రేగింది.
ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశారు. సచివాలయం మూడో అంతస్తు పైనుంచి దూకేశారు. ఆయన సేఫ్టీ నెట్స్ లో పడటంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎమెల్యే సచివాలయం పైనుంచి దూకేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దూకేశారు. ముగ్గురిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలను సచివాలయం నుంచి తరలించారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే ఊరుకునేది లేదని, వారికి పెసా చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని నరహరి జిర్వాల్ పేర్కొన్నారు.