బాహుబలి, రంగస్థలం.. లాంటి తెలుగు చిత్రాలు ఫిల్మ్ఫెస్టివల్కి ఎంపిక అవ్వడం చూస్తూనే ఉన్నాం. అవి బాక్సాఫీసు దగ్గర భారీ విజయాల్ని అందుకున్నాయి. అశేష సినీ అభిమానుల ఆదరణకు నోచుకున్నాయి. కాబట్టి ఫిల్మ్ఫెస్టివల్స్కి వెళ్లడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఓ చిన్న సినిమా, అందునా విడుదలకు ముందే చిత్రోత్సవాలకు ఎంపికైంది. అదే… `దేశంలో దొంగలు పడ్డారు`. అలీ తమ్ముడు ఖయూమ్ హీరోగా నటించిన చిత్రమిది. గౌతమ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలకు ముందే అంతర్జాతీయం స్థాయిలో ప్రసిద్ధిగాంచిన బ్లాక్ బీర్ (“Black Bear” Milford,USA) ఫీల్మ్ ఫెస్టివల్ కి అధికారికంగా నామినేట్ అయ్యింది “స్టార్ హిరోలు ఉంటేనే సినిమా చూద్దామని ఆడియన్స్ ఇంతకుముందులా అనుకోవడం లేదు. కొత్త కథలతో, కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సినిమా చిన్నదా, పెద్దదా అన్న తేడాను పట్టించుకోకుండా.. సబ్జెక్ట్ నచ్చితే చాలు బ్రహ్మారథం పడుతున్నారు. “క్షణం ,పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి, RX100” సినిమాలు సినీ పరిశ్రమలో వచ్చిన మార్పును కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాయి.