హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు రోజుకొకటి చనిపోతున్నాయి. చెట్లు కొట్టి వేయడం వల్లనే అవి బయటకు వస్తున్నయని ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్ముకుండా చేసి ఆ నాలుగు వందల ఎకరాలతో పాటు హెచ్ సీయూ మొత్తాన్ని ఎకో పార్క్ గా చేసేలా గొప్ప ప్లాన్లు అమలు చేస్తున్నారు. ఈ విషయంలో వారి రాజకీయం వర్కవుట్ అవుతోంది. ఈ పరిస్థితి చూసి వైసీపీ నేతలు .. ముఖ్యం కుట్రలు, వ్యూహాలు అమలు చేసే వారు నాలిక్కరుచుకుని ఉంటారు. ఐదు సంవత్సరాల పాటు అమరావతిలో పెరిగిపోయేలా చేసిన పిచ్చి మొక్కల్లో నాలుగైదు జింకల్ని , ఓ పది నెమళ్లను వదిలేసి ఉంటే జాతీయ స్థాయిలో రచ్చ చేసి అమరావతిని క్యాన్సిలేషన్ చేయించి ఈకో పార్క్ చేయాలని కోర్టుల్లో పిటిషన్లు వేసి ఉండేవారు.
ఖాళీగా ఉన్న భూముల్లో. చెట్లు పెరగడం సహజమే. కావాలని నిరుపయోగంగా చేసిన భూములు.. అంతకు ముందు వ్యవసాయభూములుగా ఉన్న వాటిల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. అన్ని రెడీ చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించి వెళ్తే… అన్ని పనులు ఆపేశారు. చివరికి రోడ్లను తవ్వేసుకుని వెళ్లారు. అమరావతిని అడవిగా మార్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వతా డిఫారెస్టేషన్ అంటే.. పిచ్చి మొక్కలు, తుప్పలు తొలగించడానికే మూడు నెలల సమయం పట్టింది. ఓటమి షాక్ లో ఉన్న వైసీపీ నేతలకు.. అమరావతిపై కొత్తగా ఎలాంటి కుట్రలు చేయాలో స్ట్రైక్ కాలేదు. లేకపోతే అదంతా అడవి అని.. అడవిని డిఫారేస్టేషన్ చేస్తున్నారని జింకలు, నెమళ్లను తెచ్చి పెట్టి కావాల్సిన రాజకీయం చేసేవారు.
అమరావతిలో ఇప్పుడు చెట్లు, పిచ్చి మొక్కల ఆనవాళ్లు లేకుండా కోసేశారు. అన్నింటినీ పిండి చేసేశారు., ఇప్పుడు అంతా విశాలమైన ప్రాంతంగానే కనిపిస్తోంది. పదేళ్ల క్రితం కట్టిన పునాదులు.. సగం సగం ఇళ్లు బయటపడ్డాయి. వాటి నిర్మాణాన్ని మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు, అమరావతి పనుల టెండర్లు ఖరారయ్యాయి. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. హైకోర్టు, అసెంబ్లీతో పాటు పరిపాలనా భవనాల టెండర్లను ఖరారు చేశారు., రెండేళ్లలో వాటి నిర్మాణం పూర్తి చేయడాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు.