మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి సంబరాలు మొదలవ్వబోతున్నాయి. నాగబాబు తనయ నిహారికకి చైతన్యతో పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. డిసెంబరులో పెళ్లి. కరోనా కాలం ఇది. సెలబ్రెటీల ఇళ్లలో పెళ్లిళ్లు కూడా సింపుల్ గా జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి కూడా సింపుల్ గా చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఈసారి డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నిహారిక పెళ్లి రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉంది. పెళ్లి వేదికని త్వరలోనే ఖరారు చేస్తామని నాగబాబు చెప్పారు. “డిసెంబరులో నిహారిక పెళ్లి జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేశాం. అందులో ఒకచోటు ఖరారు చేసి, త్వరలోనే చెబుతాం. పెళ్లి ఏర్పాట్లన్నీ వరుణ్‌తేజ్ చూసుకుంటున్నాడు” అని నాగబాబు చెబుతున్నారు. గోవాలో నిహారిక పెళ్లి చేయాలని ముందు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు వేదిక రాజస్థాన్‌కి మారింది. డిసెంబరులో పెళ్లి అన్నారు గానీ, ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. వేదికతో పాటు, పెళ్లి ముహూర్తాన్ని త్వరలోనే ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటిస్తారు.