సీఐడీ కోర్టులో సీఐడీ చంద్రబాబు రిమాండ్ రిపోర్టును చివరి క్షణంలో సబ్ మిట్ చేసింది. ఈ రిమాండ్ రిపోర్టు చూసిన న్యాయనిపుణులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇందులో ఒక్కటంటే ఒక్క కొత్త ఆధారం గురించి చెప్పకపోగా.. ఇప్పటి వరకూ సాక్షి మీడియాలో వచ్చినా.. సజ్జల చెప్పిన కుట్ర సిద్ధాంతాలే కనిపించాయి. చంద్రబాబుపై ఒక్క ఆధారం లేదు.
పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ అనే వ్యక్తులకు డబ్బులు అందాయని.. చెప్పారు. ఎలా చెప్పగలరు అంటే.. ఆధారాలను ఐటీ శాఖను అడిగామని ..ఇంకా రావాల్సిందని కబుర్లు చెప్పారు. ఐటీ శాఖ ఆధారాలివ్వకుండానే.. డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఊహించేసుకుని.. కేసు పెట్టారని సీఐడీ అధికారులే రిమాండ్ రిపోర్టులో చెప్పినట్లయింది. వారిద్దరికి డబ్బులిచ్చిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చామని.. తర్వాత వారు విదేశాలకు వెళ్లారని చెప్పుకొచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండున్నరేళ్లు.. ఇప్పటికీ వారిని అనేక సార్లు ప్రశ్నించారు. ఎంత చేయాలో అంత చేశారు. మరి ఎందుకు ఆధారాలు కనిపెట్టలేకపోయారన్నది మాత్రం కోర్టు ముందు చెప్పుకోలేకపోయారు.
చంద్రబాబు ఏ 1 అంటూ తప్పుడు ప్రచారాన్ని… నీలి, కూలి మీడియాల్లో విస్తృతంగా చేశారు. కానీ రిమాండ్ రిపోర్టులో ఆయనను ఏ 37గా పేర్కొన్నారు. ఆయన అంతిమ లబ్దిదారు అనడానికి తప్పు చేశారనడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీఐడీ చీఫ్ నోటి మాటగా చేసిన ఆరోపమల్నే చూపించారు. నిధుల దుర్వినియోగం అయిందని.. ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని .. చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీశారని ఇళా ఇరవై ఎనిమిది పేజీల్లో ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ఆరోపణలో తరహాలో చేశారు. నిధుల దుర్వినియోగం అయ్యాయని సాక్షి పత్రికలో వచ్చిన కథలే ఇంగ్లిష్ లో రిమాండ్ రిపోర్టులో చూపించారు.
ఎందుకు ఎందుకు హఠాత్తుగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే.. కేసు తీవ్రత దృష్ట్యా అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పారిపోయే అవకాశం లేకపోయినా తీవ్రత దృష్ట్యా అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. అంత తవ్రత ఏముంది.. కొత్త విషయాలు ఏమి కనిపెట్టారు.. అసలు ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్రేమిటన్నదానిపై చిన్న ఆధారాన్ని సీఐడీ చూపించలేదు. మొత్తంగా చంద్రబాబు అలా చేశారని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.
అందులోనూ పూర్తి వివరాలు చెప్పలేదని.. ప్రాజెక్టు పూర్తి అయిందా లేదా… పెట్టిన డబ్బులకు తగ్గట్లుగా ఒప్పందంలో చెప్పుకున్నట్లుగా స్కిల్ సెంటర్లు పెట్టారా లేదా అన్నది చెప్పలేదు. అది చెబితే నిధుల దుర్వినియోగం అనే ప్రశ్నే లేదు.
అయితే సీఐడీ చెబుతున్నరూ. 271 కోట్ల నిధుల దుర్వినియోగం .. స్కిల్ కంపెనీల కాంట్రాక్ట్ పొందిన వారు జిఎస్టీ ఎగ్గొట్టడానికి రకరకాలుగా తిప్పుకున్నారు. అది జీఎస్టీ, ఈడీ చూసుకుంటున్నాయి. ఐదేళ్ల కిందే కేసులయ్యాయి. కానీ ఇందులో చంద్రబాబుకు.. ఇతరులకు సంబంధం ఏమిటన్నది సీఐడీ చెప్పలేకపోతోంది.