ఖాళీ అయిన ఎటిఎం లను వెంట వెంటనే నింపలేని పరిస్ధితి అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే తప్పడం లేదు. ఆదివారం ఎలాగూ సెలవే! రెండో శనివారం నాలుగో శనివారం కూడా సెలవులు అయిపోవడం వల్ల నెలలో బ్యాంకులకు వరుసగా రెండురోజుల సెలవులు రెండుసార్లు వస్తున్నాయి. ఆరోజులకు ముందుగాని వెనుకగాని ఏదైనా జాతీయ సెలవు దినం వచ్చిందంటే చాలు…ఖాళీ అయిన ఎటిఎం లు వెంటనే నిండటం లేదు.
నెట్ బ్యాంకింగ్ విస్తరిస్తోంది. ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్లు పెరిగిపోతున్నాయి. మరో వైపు సేవింగ్స్ అకౌంట్లలో, టెర్మ్ డిపాజిట్లలో డబ్బు జమచేయడం తగ్గిపోతోంది. ఆన్ లైన్ పే ఆర్డర్లవల్ల తరిగిపోయే సొమ్ముని డిపాజిట్లు భర్తీ చేయలేకపోతున్నాయి. వరుసగా మూడునాలుగు రోజులు సెలవు వచ్చినపుడు
క్రెడిట్ కి, డెబిట్ కీ మధ్య తేడా విపరీతంగా పెరిగిపోతోంది. క్యాష్ ఫ్లోలో తగ్గుదల వల్లే ఖాళీ అయిన ఎటిఎంలను వెంటనే నింపలేకపోతున్నామని ఒక జాతీయ బ్యాంకు అధికారి పి ఆర్ కొండా వివరించారు.
నల్లధనాన్ని తగ్గించి పారదర్శకతను పెంచాలన్న ప్రభుత్వ ఆర్ధిక విధానం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటింగ్ ల వల్ల పటిష్టమౌతోంది. మరోవైపు ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాల వల్ల భూమి ధరలు పెరుగుతున్నాయి. కొనుగోళ్ళకు చెల్లించే డబ్బులో డాక్యుమెంట్ల మీద ప్రస్తావించే ధరకంటే వాస్తవంగా చెల్లించే ధర ఎన్నో రెట్లు ఎక్కువ గా వుంటుంది. ఈ ఎక్కువ ధర ద్వారా లభించిన సొమ్ముని బ్యాంకులో వెయ్యరు. ఇది కూడా బ్యాంకుల క్యాష్ ఫ్రో పడిపోడానికి ఒక కారణం.
రిజర్వు బ్యాంకు పరిస్ధితిని నమీక్షించి, క్యాష్ ఫ్లో పెంచవలసిన అవసరం వుంటే మార్కెట్ లోకి అదనపు కరెన్సీ ని విడుదల చేస్తుంది…అయితే, ప్రస్తుతానికి అయితే అదనపు కరెన్సీ అవసరం వుండకపోచ్చని నిపుణులు అంటున్నారు.