నాగార్జున, నాని కలసి నటిస్తున్నారనగానే ఆసక్తి మొదలైపోయింది. పైగా టైటిల్ `దేవదాస్`. ఊహలు, అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఫస్ట్ లుక్ వచ్చింది. ఇప్పటి వరకూ చూసిన స్టార్ హీరోల ఫస్ట్లుక్కులతో పోలిస్తే… ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంది. దేవ్, దాస్ ఇద్దరూ కలసి, పీకల్దాకా తాగి.. బొజ్జున్న పోస్టర్ అది. దేవ్ చేతిలి మందు బాటిల్, పిస్టల్, దాస్ మెడలో సెతస్కోప్… టైటిల్‌కీ వాళ్ల పాత్రలకు న్యాయం చేశాయి. ఫస్ట్ లుక్ ఫన్నీగా ఉంది. `ఇంకా దిగి ఉండదు వీళ్లకు. ఒక్కసారి లేచారంటే అల్లరే అల్లరి` అంటూ ఈ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వేకప్ ఆన్ 27 సెప్టెంబరు అంటూ… విడుదల తేదీ చెప్పేశారు. ఈ సినిమా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైపోతోంది. సినిమాలో కూడా ఇంతే ఫన్ ఉంటే.. తప్పకుండా బాక్సాఫీసు దగ్గర నిలబడిపోతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అకాంక్ష సింగ్, రష్మిక కథానాయికలుగా నటిస్తున్నారు.