ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి వారసులంతా (ఎన్టీఆర్ మినహాయించి) కనిపిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ కెమెరా మొహం చూడని వాళ్లని సైతం ఈ సినిమా కోసం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ మనవడు.. ఎన్టీఆర్ కిమూడోతరం వారసుడు దైవాన్ష్ని ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. లోకేష్ – బ్రాహ్మణిల తొలి సంతానం దైవాన్ష్ అన్న సంగతి తెలిసిందే. ఈమధ్య బాలయ్య ఆటపాటలన్నీ దైవాన్ష్తోనే. ఇప్పుడు దైవాన్ష్ని `ఎన్టీఆర్` బయోపిక్ ద్వారా తెరపైకి తీసుకురాబోతున్నారు. చిన్నప్పటి ఎన్టీఆర్‌గా.. దైవాన్ష్ని చూపిస్తారని టాలీవుడ్ టాక్. తల్లి పొత్తిళ్లలో ఉన్న ఎన్టీఆర్‌గా దైవాన్ష్ కనిపిస్తాడు. కాస్త ఎదిగాక.. కల్యాణ్‌రామ్ తనయుడు శౌర్యరామ్ కనిపిస్తాడట. కల్యాణ్‌రామ్, హరికృష్ణ, తారకరత్నలు కూడా చిన్న చిన్న పాత్రలు పోషించబోతున్నారు.