పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ బాలీవుడ్ నుంచే స్టార్ట్ కావడమే రైట్ స్ట్రాటజీ. దేవర టీం కూడా ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతుంది. దేవర ప్రమోషన్స్ అక్కడి నుంచే మొదలయ్యాయి. దేవర ట్రైలర్ ని ముంబై లో లాంచ్ చేశారు. కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు ఎన్టీఆర్ జాన్వి కపూర్ సందడి చేశారు. ఈ ఈవెంట్ బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కరణ్ జోహార్ సందీప్ రెడ్డి వంగతో దేవర టీం ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అవుతోంది.
తెలుగులో దేవరకి మంచి హైపుంది. ఓపెనింగ్ వసూళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సినిమా ఎలా ఉన్నా గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. తొలి రోజు వంద కోట్ల మార్క్ ని చేరుకోవొచ్చన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పుడు బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాలి. ప్రభాస్ సినిమాలు మినహాయిస్తే మిగతా హీరోల సినిమాలు నార్త్ లో ఆశించినంత స్థాయిలో ఓపెనింగ్స్ రావడం లేదు. సినిమా బాగుంటేనే వెళ్తున్నారు. పుష్ప కూడా అలానే చూశారు. అక్కడ ఓపెనింగ్స్ రావాలంటే ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. దేవర టీమ్ కూడా ఇప్పుడు అదే చేస్తోంది.
నిజానికి ఈ స్ట్రాటజీ రాజమౌళిది. ఆయన సినిమాల ప్రమోషన్స్ ముంబైలోనే మొదలౌతాయి. ముందు అక్కడి మీడియాని, సినీ వర్గాల్ని, ముఖ్యంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పని ప్రారంభం అవుతుతోంది. పైగా ఇప్పుడు దేవర ప్రమోషన్స్ విషయంలో ఎస్ఎస్ కార్తికేయ టీంనే పని చేస్తుంది. ఈ టీం ప్లాన్ పకడ్బందీగా వుంటుంది. ప్రింట్, వెబ్, ఛానల్స్, సోషల్ మీడియా ఇలా అన్నీ వైపులు నుంచి సినిమాకి గట్టి ప్రచారం కల్పిస్తున్నారు. తెలుగులో ఎలాగు కావాల్సినంత బజ్ వుంది కాబట్టి ఇక్కడ జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ తో ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈనెల 22న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అక్కడి నుంచి మరో వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్లు చురుగ్గా చేయాలని భావిస్తున్నారు.