ముంబైలో ‘దేవ‌ర‌’ ట్రైల‌ర్‌

ఈనెల 27న ‘దేవ‌ర‌’ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదో పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఈవెంట్ నిర్వ‌హించ‌లేదు. అందుకే ఇప్పుడు ట్రైల‌ర్‌తో ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించింది. ఈనెల 10న ‘దేవ‌ర‌’ ట్రైల‌ర్ రాబోతోంది. ముంబైలో జ‌రిగే ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో ట్రైల‌ర్ ఆవిష్క‌రిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ తో పాటు చిత్ర‌బృందం మొత్తం పాల్గొన‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాలోంచి 3 పాట‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రో రెండు పాట‌లు రావాల్సివుంది. హైద‌రాబాద్ లో జ‌రిగే ఓ ఈవెంట్ లో చివ‌రి పాట‌ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఆయుధ పూజ‌కు సంబంధించిన ఓ పాట ఉంది. అది నేరుగా థియేట‌ర్ల‌లోనే వినిపిస్తారు. ‘దావూదీ’ అనే పాట‌ని చిత్ర‌బృందం ఇటీవ‌లే విడుద‌ల చేసింది. అయితే ఈ పాట‌కు సంబంధించిన స‌రైన సెట్యువేష‌న్ క‌థ‌లో దొర‌క‌లేద‌ట‌. అందుకే ఈ పాట రోలింగ్ టైటిల్స్ లో వేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

దాదాపు 2 నిమిషాల నిడివి గ‌ల ట్రైల‌ర్ ని ఇది వ‌ర‌కే చిత్ర‌బృందం క‌ట్ చేసి పెట్టింది. ఈ ట్రైల‌ర్‌లో యాక్ష‌న్‌కి పెద్ద పీట వేశార‌ని తెలుస్తోంది. డైలాగులు కూడా ప‌వ‌ర్ ఫుల్ గా వినిపించ‌బోతున్నాయ‌ని స‌మాచారం. విడుద‌ల‌కు ముందే మ‌రో ట్రైల‌ర్ కూడా రాబోతోంద‌ని తెలుస్తోంది. అది ప్రీ రిలీజ్ వేడుక‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. ‘దేవ‌ర‌’ని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close