వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు దేవిరెడ్డిశివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు సమర్పిచాలని.. ప్రతి వారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశిచింది. అలాగే ఏపీలో ప్రవేశించకూడదని షరతు పెట్టింది.
శివశంకర్ రెడ్డి పులివెందుల మొత్తం వైసీపీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ఆయన జైల్లో ఉండటం వల్ల పార్టీని అవినాష్ రెడ్డి చూసుకుంటున్నారు. అది ఆయన వల్ల కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడం వైసీపీ వర్గాలకు ఊరట లభిస్తుంది. ఆయన ఏపీలో ఎంటర్ కాకపోయినా… అయినా… పట్టించుకునేవారు ఉండరు. ఎందుకంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఉంది. ఫోన్ల ద్వారా ఆయన వైసీపీ పరిస్థితుల్ని చక్క బెట్టగరలని అనుకుంటున్నారు.
ఇటీవల శివంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో జైల్లోకి వెళ్లి దస్తగిరిని ప్రలోభపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టకపోయినా దస్తగిరి ఉన్న ప్పుడే పెట్టాడు. అధికారులు అంగీకారం తెలిపారు. అయితే ఆ సమయంలో.. దస్తగిరిని బెదిరించి.. రూ. 20 కోట్ల ఆశ చూపి.. రివర్స్ స్టేట్ మెంట్ ఇవ్వాలని బేరం ఆడారని.. దస్తగిరినే బయటకు వచ్చి ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడంతో.. కీలక పరిణామంగా మారింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ అదే పనిగా సుప్రీంకోర్టులో వాయిదా పడుతోంది.