మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ అంటే చాలు మనకు గుర్తొచ్చేది ఒక్కటే జోష్ ఫుల్ మ్యూజిక్. మనసుని ఉల్లాస పరచాలన్నా.. ఉత్తేజ పరచాలన్నా నచ్చిన సంగీతం వింటే చాలు. అయితే ప్రత్యేకంగా దేవి ఆల్బం అయితే మనసుని కదిలించే సాంగ్స్ తో పాటుగా ఎగితిగంతేసే సాంగ్స్ కూడా ఉంటాయి. ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ ప్రసాద్ అనతికాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అయిపోయాడు. ఏ సినిమా అయినా సరే దేవి మ్యూజిక్ అంటే చాలు సినిమా సగం హిట్ అన్నట్టే.
అల్లరి చేసే సంగీత సరిగమకు ఓ తోడు దొరికిందట. అవునండి దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్లో ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడట. దేవి లవ్ అంటే కాదనే హీరోయిన్ ఉంటుందా చెప్పండి. ఘాడంగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తన సంగీతంతో హుషారెత్తించే పాటలందించే దేవి మనసు ఎవరో అమ్మాయి గెలుచుకుందన్న మాట.
ఇంకే పగలే వెన్నల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం అనుకున్నాను.. కాని ఇప్పుడు.. అని దేవి తన పాటని తానే వినాల్సి వస్తుంది కావొచ్చు. మరి ఇంతకీ ఈ రాక్ స్టార్ ని వల్లో వేసుకున్న అమ్మాయి ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. సడెన్ గా మ్యారేజ్ చేసుకుని ఆ హీరోయిన్ ఎవరు అన్నది తెలియచేసే ఆలోచనలో ఉన్నాడట దేవి. దేవి లవ్ సక్సెస్ కాబట్టి ఆయన సంగీతాన్ని ఆస్వాధించే సంగీత ప్రియులంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.