చిత్రపరిశ్రమలో ప్రతీ కాంబినేషన్‌కీ ఓ లెక్క ఉంటుంది. సెంటిమెంట్ అనుకోండి.. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ అనుకోండి.. కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. అదేంటో ఆ కాంబోని ఎన్నిసార్లు చూసినా మనకీ బోర్ కొట్టదు. అలాంటి కాంబినేషన్ అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్. ఆర్య నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకూ వీళ్లిద్దరి కలయికలో వచ్చిన పాటల్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులోనూ ఆయా సినిమాల్లో ఐటెమ్ పాటలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని నిలిచిపోయాయి. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతోంది.
అవును.. అల్లు అర్జున్ కథానాయకుడిగా లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. స్ర్కిప్టు సిద్ధమైంది.. ఇందులో బన్నీ రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని టాక్. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఫిక్స్ చేస్తున్నారు. స్వరాల బాధ్యత దేవిశ్రీ కి అప్పగించినట్టు తెలుస్తోంది. సో.. మరో సూపర్ హిట్ ఆల్బమ్‌కి బన్నీ ఫ్యాన్స్ రెడీ అయిపోవొచ్చన్నమాట.