చిరంజీవి- బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా154 కోసం పాటలు పూర్తి చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రం కోసం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేశారని తెలిసింది. చిరంజీవి సినిమాలో మెలోడి కూడా బాగా కుదురుతుంది. దేవిశ్రీ ప్రసాద్ కూడా మెలోడి ఇవ్వడంలో దిట్ట. ఐతే ఈ సినిమాలో మాత్రం మెలోడికి చోటు లేదు. నాలుగు పాటలుంటే నాలుగూ మాస్ సాంగ్స్ కొట్టారని తెలిసింది.
ఇందులో చిరు ఇంట్రో సాంగ్ అద్భుతంగా వచ్చింది ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో రవితేజ కూడా కీలక పాత్ర పోహిస్తున్న సంగతి తెలిసింది. చిరు, రవితేజ కాంబోలో కూడా ఒక పాట వుంటుదట. అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.