వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న వెబ్ సైట్ తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని.. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ రంగంలో “గాసిప్ వెబ్ సైట్”గా ప్రచారం పొంది… వైసీపీకి మద్దతుగా ఇతర పార్టీ నేతలపై.. కథనాలు ప్రసారం చేస్తుందని.. ఆ వెబ్ సైట్‌పై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు… విజయవాడలో టీడీపీకి చెందిన నేతల్ని వైసీపీలో చేర్పించేదుకు వారి క్యారెక్టర్ పై ఆ వెబ్ సైట్ బురద చల్లుతోందని టీడీపీ నేతలు అంటున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్.. వైసీపీలో చేరుతారంటూ… కొద్ది రోజులుగా… వైసీపీ అనుకూలంగా ఉండే వెబ్ సైట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
దీన్ని దేవినేని అవినాష్ ఖండించినప్పటికీ.. ఆ ప్రచారం ఆపలేదు. బొండా ఉమకు చెప్పినట్లుగా.. దేవినేని అవినాష్‌కు కూడా.. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు ఇస్తామని.. వైసీపీ అగ్రనేతలు హామీ ఇచ్చారని ప్రచారం చేశారు. అయితే.. తాను తెలుగుదేశంలోనే ఉంటానని.. దేవినేని అవినాష్ స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే.. కొత్తగా… టీడీపీ అధినాకత్వంలో.. దేవినేని అవినాష్‌పై.. అనుమానాలు పెరిగేలా.. వైసీపీకి చెందిన అనుకూల వెబై సైట్లు కథనాలు రాస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ను.. పదవి నుంచి తప్పించాలని.. దేవినేని అవినాష్ డిమాండ్ చేశారంటూ… కథనాలు రాయడంతో.. టీడీపీ యువనేత.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్యవార్తలు ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తక్షణం.. సదరు వెబ్ సైట్లపై.. చర్యలు తీసుకోవాలని కోరారు లోకేష్ తమ పార్టీ యువనాయకుడని.. ఆయన నాయకత్వంలో పని చేస్తున్నారమని గుర్తు చేశారు. టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో పార్టీ మార్పు ప్రచారం చేస్తున్నారు. అవి వర్కవుట్ కాకపోతే.. హైకమాండ్ కు అనుమానం కలిగేలా కథనాలు రాస్తూ.. ఏ దారి లేక వారు వైసీపీలోకి చేరేలా గాసిప్ వెబ్ సైట్ తన వంతు ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.