శ్రీవారి భూముల్ని అమ్మాలని తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. దానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను..!
మరి టీటీడీ బోర్డు చైర్మన్‌ను ఎవరు నియమించారు..?
టీటీడీకి స్వతంత్ర బోర్డు ఉంటుంది.. వారు నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రభుత్వానికి సంబంధం ఉండదు..?
టీటీడీ బోర్డును ఎవరు నియమిస్తారు..?
టీడీపీ హయాంలో.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2016లోనే టీటీడీ బోర్డు భూముల అమ్మకం తీర్మానం చేశారు…!
ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు..?
ఇలా వరుసగా దూసుకొచ్చిన ప్రశ్నలకు వితండవాదంతోనే సమాధానం చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు… రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో.. ఓ టీవీ చానల్ చర్చకు వెళ్లి ఏం చెప్పాలో తెలియక.. నీళ్లు నమిలి.. ప్రభుత్వం పరువు తీసేసినంత పని చేసిన ఆయన… మళ్లీ టీటీడీ భూముల అమ్మకాలపై.. ఇంకో ఇంగ్లిష్ చానల్ డిబేట్‌కు వెళ్లారు. అక్కడా వింత వాదన వినిపించి.. సూటి ప్రశ్నలకు.. ఖండింపుల సమాధానం ఇచ్చి.. ప్రభుత్వం పరువు తీయడానికి మరోసారి మొదటి వరుసలో నిలబడ్డారు.
ప్రభుత్వం ఏదైనా పని చేయడానికి ప్రయత్నించి విఫలమైతే.. లేకపోతే విమర్శలు ఎదుర్కొంటే… చంద్రబాబుపైనో… టీడీపీ పైనో… నెట్టేయడం.. వైసీపీ నేతలకు చాలా సహజమైన విషయం. కరోనా దగ్గర్నుంచి అన్నీ.. చంద్రబాబు, టీడీపీనే చేస్తున్నారని అంటూ ఉంటారు. ఇప్పుడు వివాదాస్పదమైన టీటీడీ భూముల అమ్మకాల్లోనూ అలా అనడంలో ఆశ్చర్యం లేదు. 2016లో టీటీడీ బోర్డు అమ్మకానికి నిర్ణయం తీసుకుందని.. ఇప్పుడు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ తర్వాత కూడా బోర్డు మూడేళ్ల పాటు ఉంది. అమ్మకానికి అప్పుడే నిర్ణయం తీసుకుంటే.. మూడేళ్ల పాటు ఎందుకు సైలెంట్ గా ఉందనేది.. ఎవరికైనా వచ్చే అనుమానం. దాన్ని దాచి పెట్టి… వాళ్లు నిర్ణయం తీసుకున్నారని మేం అమ్మేస్తున్నామని కలరింగ్ ను… వైసీపీ నేతలు ఇస్తున్నారు. ప్రజలకు చెప్పడానికి ఓకే కానీ.. జాతీయ మీడియాలో ఢక్కామొక్కీలు తిన్న జర్నలిస్టుల ముందు అదే వాదన వినిపిస్తే ఎలా ఉంటుంది..? మరీ అంత అమాయకంగా… జగన్ జాతీయ మీడియా సలహాదారు.. ఎలా ఉన్నారు…?
దేవులపల్లి అమర్ .. ఇంగ్లిష్ చానల్ డిబేట్లో చేసిన వాదన వల్ల ఆ చర్చ నిర్వహించిన యాంకర్.. ఇతర ప్యానలిస్టులు.. ఆంధ్రలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ.. మొత్తం పవర్ అంతా.. ప్రతిపక్షం చేతుల్లోనే ఉందనే దానికి ఫిక్సయిపోయిన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సలహాదారుగా ఏపీ ప్రభుత్వానికి ఆయన చేసిన కీడు. ఏపీ సర్కార్ ఏమీ చేయడం లేదని.. ప్రతిపక్షమే అంతా చేస్తోందన్న అభిప్రాయాన్ని ఆయన జాతీయ మీడియాలో కల్పించారు. సలహాదారుగా ఆయన ఘోరంగా విఫలమయ్యారనడానికి ఈ టీవీ చానల్ డిబేట్లే సాక్ష్యంగా మారాయి.
జాతీయ మీడియాలో ప్రభుత్వ కార్యక్రమాలకు అనుకూలంగా వార్తలు ఇప్పించడంలో అమర్ లాబీయింగ్ ఇప్పటికే ఫెయిలయింది. ఆయన కోఆర్డినేషన్ వల్ల.. ఒక్క ఉపయోగమూ కనిపించలేదు. చివరకు అంతో ఇంతో అనుకూలంగా ఉంటుందని అనుకున్న ఎన్డీటీవీకి… షార్టుఫిల్ములు, సర్వేల కాంట్రాక్ట్ ఇచ్చి ప్రభుత్వం సంతృప్తి పరచాల్సి వచ్చింది.
.@TimesNow – Yet again, Devulapalli Amar fails to provide convincing argument on National TV
He is paid 4 lakhs per month + business class
Couldn't @ysjagan find a better journo from Andhra instead of importing Amar from TG?
Huge waste of public moneyhttps://t.co/rynzRVhCfH
— Telugu360 (@Telugu360) May 26, 2020