ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకున్న మాజీ సాక్షి ఉద్యోగుల్లో ఒకరు దేవులపల్లి అమర్. ఆయన జర్నలిస్టుగా కంటే జర్నలిస్టు నాయకుడిగా ఎక్కువగా చెలామణి అవుతారు. తెలంగాణ ఉద్యమంపై ఆంధ్రపై ఆయన చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అదే ఆంధ్ర ప్రజలు కట్టిన పన్నులను ఒక్క రోజు కూడా పని చేయకుండా నెలకు రూ. మూడు లక్షలకుపైగా సొంతం చేసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఆయన సలహాదారు పదవిలోనే ఉన్నారు. ఏం సలహాలిచ్చారో ఎవరికీ తెలియదు.
పోనీ ఏదైనా సమావేశంలో పాల్గొన్నారా అంటే అదీ ఉండదు. మీడియాకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ చేస్తే మాత్రం సమర్థించడానికి మీడియా ముందుకు వస్తారు. కానీ ఆయనకు ఏపీ ప్రజలు పన్నులు కట్టిన సొమ్ములు మాత్రం ఠంచన్‌గా అందుతాయి. కేబినెట్ హోదా కూడా వస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆయన అమరావతికి వచ్చి విధులు నిర్వహించాల్సిన పని లేదు.
ఆయనకు గత నెలలోనే పదవీ కాలం ముగిసిపోయినా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు నిజానికి సలహాదారులను ఎప్పటికప్పుడు నియమిస్తూ పోవడమే కానీ.. ఎవర్నీ తొలగించలేదు. ఎవరికి పదవీ కాలం పూర్తయినా కొనసాగిస్తున్నారు. ప్రజల డబ్బును అప్పనంగా జీతంలాగా తీసుకోలేక రామచంద్రమూర్తి లాంటి ఒకరిద్దరు దండం పెట్టి వెళ్లిపోయారు కానీ.. ఏ మాత్రం సిగ్గుపడని అమర్ లాంటి వాళ్లు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు.