జర్నలిస్టునని చెప్పి జర్నలిజాన్ని అమ్మేసుకునే పెద్దలు చాలా మంది ఉంటారు. అయితే కొంత మంది వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారు. విచిత్రంగా కొంత మంది తమకు వ్యక్తిత్వం , విలువలు కూడా ఉండవని మొత్తానికి విలువ కట్టి దిగంబరంగా నిలబడతామని నిరూపిస్తూ ఉంటారు. అలాంటి అగ్రగణ్యులు దేవులపల్లి అమర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజల్ని నిందించి , వారి దోపిడీదారులని ముద్రవేసి .. ఇప్పుడు అదే ఏపీ ప్రజల సొమ్మును నెలకు ఐదారు లక్షల వరకూ అప్పనంగా దిగమింగుతున్నారు. ఇప్పుడు ఎంతకైనా దిగజారిపోతానని వైసీపీకి అవసరం వచ్చినప్పడుల్లా జర్నలిజం ముసుగులో బయటకు వచ్చేస్తున్నారు. ఆర్జీవీతో కలిసి ఆయన జర్నలిజంపై చెప్పిన ముచ్చట్లు వింటే పతివ్రత పరమాన్నం వండితే ఆరు నెలలు చల్లారలేదనే సామెత గుర్తుకు రావడం ఖాయం.
ఇంత కాలం జర్నలిస్టుగా చేశారుగా .. ఆత్మసాక్షి, మనస్సాక్షి ఉండదా ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంపై లబలబలాడిపోతున్నారు దేవులపల్లి అమర్. ఆయనతో జర్నలిజం విలువల గురించి ఆయనతో మాట్లాడించడానికి సాక్షి కూడా సిగ్గు పడిందో..కూలీ మీడియాలు కూడా ఆయన నీడపడటానికి కూడా అంగీకరించలేదో కానీ ఓ పెయిడ్ యూట్యూబ్ చానల్ లో చర్చ పెట్టి జర్నలిజంపై నీతులు వల్లించారు. ఇందులో ఆయన చెప్పిన ప్రతీ మాట సాక్షి మీడియాకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన జర్నలిజం ప్రమాణాలు పాటించని ఒకే ఒక్క సంస్థ సాక్షి. కానీ ఆయన మాత్రం.. అదంతా సాక్షి మీడియాకు కాదు నిజాలు చెబుతున్న ఇతర మీడియాదన్నట్లుగా బురద చల్లే ప్రయత్నం చేశారు.
జర్నలిజం అనుభవాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నారెందుకు ?
ఈ దేవులపల్లి అమర్ జర్నలిస్టు నాయకుడిగా చేసిన నిర్వాకాల గురించి మనకు అక్కర్లేదు కానీ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం.. సాక్షిలో జర్నలిస్టుగా ఏం చేశారో చెప్పుకోవాలంటే కథలు కథలుగా ఉంటాయి. వైఎస్ వివేకానందరెడ్డిని అడ్డగోలుగా నరికి చంపేసి.. దాన్ని చంద్రబాబుకు అంటించేసి..చంద్రబాబు చేతిలో వేట కత్తి గ్రాఫిక్స్ చేసి పెట్టి.. నారాసుర రక్త చరిత్ర అని రాస్తే.. ఈ దేవులపల్లి అమరే .. స్క్రీన్ మీదకెళ్లి.. తానే కళ్లతో చూసినట్లుగా.. చంద్రబాబే నరికి చంపినట్లుగా యాంకరింగ్ చేసేశాడు. అది ఒకటి కాదు.. అది మచ్చకు మాత్రమే. అసలు సాక్షి చానల్ లో కానీ.. పత్రికలో కానీ వచ్చే ఒక్క వార్తకు అయినా ఆధారం ఉందని ఈ అమర్ నిరూపించగలరా ?. చాన్సే లేదు. మరి తన కింద ఇంత నలుపు పెట్టుకుని ఇతరులకు..అదీ కూడా నిజాలు చెబుతున్న మీడియాపై ఎందుకు ఇలాంటి పిల్లిబిత్తిరి కబుర్లు చెప్పుకుని బతుకుతున్నట్లు ?. అంత వరకూ ఎందుకు అమరావతి లో స్కాంలో అంటూ పవన్ కూ భాగమనుందని రాసేశారు కదా.. దానికి ఒక్క సాక్ష్యం చూపించమని సాక్షిని ఈ అమర్ అడగగలరా ?
డబ్బుకేం తక్కువ లేదుగా .. ఎందుకీ దిగజారుడు !
జర్నలిజాన్ని నమ్ముకుని బతికిన వాళ్లు అగచాట్లు పడుతూంటారేమో కానీ అమ్ముకుని బతికిన వాళ్లు బాగానే స్థిరపడ్డారు. ఇలా అమ్ముకున్న వారిలో మొదటి రకం అయిన దేవులపల్లి అమర్.. బాగా స్థిరపడ్డారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి ఈయన ఖాతాలో ప్రతీ నెలా ఏపీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్లో రూ. ఐదు లక్షల వరకూ ఖాతాల్లో పడుతూంటాయి. అలాంటప్పుడు తనను తాను దిగంబరంగా జర్నలిజం సమాజంలో నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదుగా ? అయినా కక్కుర్తి పడటం ఎందుకు.. ?
బాధితులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తెలియదా ?
రేపేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. కానీ ఎవరి కోసం అయితే అడ్డగోలు ఆరోపణలతో బాధితుల్ని చేశారో..వారి చేతికి అధికారం వస్తే రాళ్లేసిన వాళ్లను వదిలేస్తారని.. జర్నలిజం ముసుగులో దాక్కోవచ్చని అనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే.. ఓ రిటైర్డ్ సీనియర్ జర్నలిస్టును వాట్సాప్ ఫార్వార్డ్ కేసులో అరెస్ట్ చేస్తే సమర్థించిన మాటలు .. ఎవరూ మర్చిపోరు.