ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉంటూ… మీడియాకు సంకెళ్లు వేసే జీవోను అడ్డగోలుగా సమర్థించిన దేవులపల్లి అమర్.. జర్నలిజం ప్రపంచంలో.. ఇంత కాలం.. తాను సంపాదించుకున్న రెప్యూటేషన్‌ను.. ఒక్కసారిగా కూలదోసుకున్నారు. ఈ పరిణామం.. ఆయనకు ఇచ్చే గౌరవంపై పడుతోంది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను తొలగించారు. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను సమర్థిస్తూ.. మాట్లాడిన ఆయనపై.. సహజంగానే… తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రెస్ కౌన్సిల్‌తో పాటు… దేశంలో ఉన్న అన్ని మీడియా అనుబంధ సంస్థలు కూడా.. జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను ఖండించాయి. అయితే.. ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్న దేవులపల్లి అమర్ సమర్థించడంతో.. ఆయనపై ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తమయింది.
తప్పుకోకపోతే.. పరువు పోతుందని.. క్లారిటీ రావడంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే… ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైన ఐజేయూ కార్యవర్గం ..ప్రజాపక్షం ఎడిటర్‌గా ఉన్న కె.శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కె.శ్రీనివాసరెడ్డి కూడా.. చాలా కాలంగా.. ఐజేయూలో ఉన్నారు. అమర్ వ్యవహారం జర్నలిస్టు సంఘాల నేతల .. వ్యక్తిత్వం మీదే అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి తెచ్చిందన్న అభిప్రాయం… అంతటా వ్యక్తమవుతోంది. దశాబ్దాల పాటు.. మీడియా స్వేచ్చ కోసం… పాత్రికేయుల కోసం పోరాటం చేసినట్లుగా చెప్పుకున్న అమర్.. ఆ పలుకుబడితోనే పేరు పొందారు.
దేవులపల్లి అమర్ జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు. ఆయన ఓ జర్నలిస్టు సంఘాల నేతగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. అలాంటిది.. ఇప్పుడు.. ఏపీ ప్రభుత్వంలో.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ.. పదవి పొందగానే.. తాను ఇంత కాలం నమ్మిన.. ఎదిగిన జర్నలిజం సిద్ధాంతాల మీదనే… తిరుగుబాటు చేస్తున్నంత పని చేస్తున్నారు. ఇది.. జర్నలిజం వ్యవస్థకే.. మాయని మచ్చలా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.