అదేంటో … ఐదేళ్ల వరకూ తమ పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నాయని.. వారి టీఏ, డీఏలు కత్తిరించినప్పుడు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి గుర్తు రాలేదు., ఇప్పుడు ఎన్నికలకు ముందు.. .మరో పది రోజుల్లో షెడ్యూల్ వచ్చే ముందు.. పోలీసులకు బోలెడన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు.
పోలీసు శాఖ గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అందులో ఏకరువు పెట్టారు. ఎన్నికలకు ముందు కనీసం ఉత్తర్వులు అయినా ఇస్తారు కదా.. దాంతో పాలాభిషేకాలు చేయవచ్చన్న ప్లాన్ ఉందేమో కానీ… ఈ లేఖ గురించి మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. డీజీపీ నేరుగా సీఎం జగన్ రెడ్డితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేయాల్సంది. కానీ అలా మాట్లాడకుండా లేఖ రాసి.. ఆ లేఖకు పోలీసు సంఘం రాసిన లేఖను జత చేసి పంపారు.
పోలీసుల్ని సొంత కార్యకర్తలుగా వాడుకుని డిపార్టుమెంట్ పై ప్రజల్లో నమ్మకం లేకుండా చేశారు. డిపార్టుమెంట్ పరువు కాపాడదామని పోలీసు పెద్ద చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. వారి సమస్యల పరిష్కారంపైనా అంతే నిర్లక్ష్యం. అసలు పోలీసులకు వీక్లీఆఫ్ అమలు చేయకుండా.. అమలు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నా నోరెత్తలేని పరిస్థితి., చాలా మంది పోలీస్ కానిస్టేబుళ్లు… ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తే… వారిని సర్వీస్ నుంచి తొలగించేందుకు సిద్ధపడ్డారు కానీ.. ప్రభుత్వం తరపున వారి సమస్యలు పరిష్కరించే బాధ్యతలు మాత్రం తీసుకోలేదు.