రోజు రోజుకీ బిగ్ బాస్ కి కనెక్ట్ అయిపోతున్నారు ఆడియన్స్. ఈ షోలో పాల్గొన్న సెలబ్రెటీలు కూడా తమ వంతు డ్రామాని పండించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. సోమవారం ఎపిసోడ్లో… ధన్‌రాజ్ పండించిన సెంటిమెంట్ సీన్ హైలెట్ అని చెప్పాలి. నిజానికి ఇందులో ఏం డ్రామా లేదు. ధన్‌రాజ్ మనసుల్లోతుల్లోంచి వచ్చిన భావోద్వేగాలే స్వచ్ఛంగా కనిపించాయి. తన కుటుంబానికి, గర్భిణిగా ఉన్న భార్యకి, కుమారుడికి దూరంగా ఉన్న ధన్‌రాజ్ – తన మనసుని కంట్రోల్ చేసుకోలేక కెమెరా ముందు ఏడ్చేశాడు. ‘నేను మనిషిగా మారా. నన్ను బిగ్ బాస్ షో మనిషిగా మార్చింది. ఓ కొత్త ధన్‌రాజ్‌ని నా కుటుంబం చూడబోతోంది’ అంటూ బోరుమని ఏడ్చేశాడు. గర్భిణిగా ఉన్న తన భార్య పదే పదే గుర్తొస్తుందని, ఇంటికి వెళ్లిపోవాలని ఉందని కన్నీళ్లు పెట్టుకొన్నాడు. ‘నీ భార్య క్షేమంగా ఉంది. నీ కోసం ఓ వీడియో చేస్తున్నాం. దాని ద్వారా నీ భార్య నీతో మాట్లాడుతుంది’ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో – ధన్‌రాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు నవ్విస్తున్న ధనరాజ్లో ఈ యాంగిల్ కూడా ఉందా?? అనే ఆశ్చర్యం వేస్తోంది. మొత్తానికి సోమవారం ఎపిసోడ్‌తో ధన్‌రాజ్ బుల్లి తెర వీక్షకులకు తెగ నచ్చేశాడు. ఈ రియాలిటీ షోకి కొత్త వన్నె తెచ్చాడు.