ధన రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం కామెడీ పోస్టర్(చూస్తూనే నవ్వు తెప్పించే) ను ఇటివలే వెబ్ మీడియా లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సహా నిర్మాత రవి కె పున్నం మాట్లాడుతూ” వంశీ గారి స్టైల్ , కాశీ నాథ్ స్టైల్ కామెడీ ఈ చిత్రం లో ఉంటుంది. దర్శకుడు చాచా చక్కటి డైలాగ్ కామెడీ తో తెరకెక్కించారు. ” అన్నారు.
నిర్మాత పి.వి.నగేష్ కుమార్ మాట్లాడుతూ ” ధన రాజ్ సోలో హీరోగా నటించిన తొలి చిత్రమిది. పాటలు పెకాడేస్తాయి. ఈ చిత్ర ఆడియో ను అతి త్వరలోనే విడుదల చేయనున్నాం ” అని అన్నారు. ఈ చిత్రం లో ధనరాజ్ సరసన ప్రాచి సిన్హ , శ్వేతా వర్మ , హరిణి, ఇషా, సీమ కథానాయికలుగా నటించారు. రఘు బాబు విలన్ గా కొండవలస ధనరాజ్ కు మామ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలోనే విడుదల జరుపుకొని నవంబర్ మొదటి వారం లో విడుదల కానుంది..