వెరైటీ కథలు, సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొనే దర్శకుడు వెంకట్ ప్రభు. ‘మానాడు’తో మరోసారి తన ప్రతిభ బయటపడింది. ‘కస్టడీ’ సినిమా ఫ్లాప్ అయినా, స్టార్ హీరోల నమ్మకం సడల్లేదు. తాజాగా విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా నడుస్తోంది. అది పూర్తయిన వెంటనే ధనుష్‌తో ఓ సినిమా చేయడానికి వెంకట్ ప్రభు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి ఏసియన్ సునీల్ నిర్మాతగా వ్యవహరించే ఛాన్సుందని సమాచారం.
సునీల్ ప్రస్తుతం.. ధనుష్‌తోనే ఓ సినిమా చేస్తున్నారు. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అంతలోనే ధనుష్ తో మరో సినిమాకి ఎగ్రిమెంట్ చేయించుకొన్నారు సునీల్. శేఖర్ కమ్ముల సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.